గుంటూరు: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్తుడైన జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం హాస్యాస్పందంగా వుందని మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. ఈ శతాబ్దంలో ఇంత కంటే పెద్ద కామెడీ ఇంకోటి ఉంటుందా అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. 

గతంలో జగన్‌ను అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక నేరస్తుడని విమర్శించిన బొత్స ఇప్పుడు అదే జగన్ ను ఆర్థిక సంస్కర్తగా పేర్కొనడం చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. ఇలాంటి బొత్స రాజకీయ విలువలు చూసి మతిపోతోందని అన్నారు. 

read more  సీఎం జగన్ కు అమిత్ షా చీవాట్లు...: నిమ్మల రామానాయుడు

దేశంలోని 40 ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు, వ్యక్తులపై ఐటీ సోదాలు జరిగితే అవన్నీ చంద్రబాబుకి సంబంధించినవే అన్నట్లు బొత్స మాట్లాడారని పేర్కొన్నారు.  చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లో సోదాలు జరిగితే స్వయంగా చంద్రబాబు ఇంట్లోనే జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని... ఆ మాత్రం బుర్రలేదా.? అంటూ విమర్శించారు.

దేశంలోనే అత్యధికంగా క్రిమినల్‌ కేసులున్న వ్యక్తిగా వారి నాయకుడు రికార్డు క్రియేట్ చేశాడని సెటైర్లు విసిరారు. అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి ఆధ్యుడైన నాయకుడి వెనక ఉంటూ నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడుతుంటే రాష్ట్ర, దేశ ప్రజలే కాదు ప్రపంచం సిగ్గుపడుతోందన్నారు. 

పంచాయతీకి, మేజర్‌ పంచాయతీకి తేడా తెలియని బొత్స నుంచి ఇంతకు మించిన జ్ఞానం ఆశించడం బుద్ధితక్కువ పనే అవుతుందన్నారు. రాజధాని అమరావతిలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం జరిగిందంటున్న బొత్స తామే అధికారంలో ఉన్నామని మరిచారా.? అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి కూడా బీద అరుపులు.. పిరికి చేష్టలు ఎందుకు.? అని విమర్శించారు. 

read more  బాబుపై కాదు కేసీఆర్ పైనే ఐటీ దాడులు...ఆ ఎనిమిదిమంది మంత్రులకోసమే...: దేవినేని ఉమ

రాజధాని  భూముల విషయంలో విచారణ చేసుకొమ్మని సవాల్‌ విసురుతుంటే ఎందుకు వెనక్కి వెళ్తున్నారు..? అని అడిగారు. తోక పత్రికలు ఏమిటి... అవి ఎలా పని చేస్తున్నాయో తమరి నాయకుడు, దోపిడీ దారుడు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేశాడని గుర్తుచేశారు. ''ఇంకా తోక పత్రికలు అంటూ మాట్లాడడం మానుకోవాలని... నీవేటోం.. నీవు, నీ తమ్ముడు చేస్తున్న మద్యం దోపిడీ గురించి విజయనగరం జిల్లా మొత్తానికి తెలుసు'' అంటూ బొత్సపై సుజయకృష్ణ రంగారావు విరుచుకుపడ్డారు.