గుంటూరు: అవినీతి రొచ్చులో కూరుకుపోయిన జగన్ అందరినీ అందులోకి లాగాలని చూస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ దాడులు జరిగిన మాట నిజమేనని... అయితే వైసిపి నాయకులు అంటున్నట్లు వేలకోట్ల అక్రమ సంపాదన బయపడిందన్నది మాత్రం పచ్చి అబద్దమన్నారు. కేవలం లక్షల్లో నగదు, కొద్దిగా బంగారం మాత్రమే ఆయన ఇంట్లో ఐటీ అధికారులకు లభించినట్లు మాజీ మంత్రి వెల్లడించారు. 

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దాదాపు రూ.2లక్షల నగదు, 12తులాల బంగారం మాత్రమే ఐటీ అధికారులు గుర్తించారని అన్నారు. అయితే అదికూడా  ఆయన తన కూతురు పెళ్లి గురించి ఇంట్లో పెట్టుకున్నారని  అన్నారు. వచ్చే నెలలో శ్రీనివాస్ కుమార్తె వివాహం ఉందని తెలిపారు దేవినేని ఉమ. 

read more  చంద్రబాబుకు చిక్కులు: వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే...?

ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచి దొంగే దొంగా దొంగా అన్న రీతిలో వైసిపి నేతలు అరుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి చెందిన 8మంది మంత్రులు, ఎంపీలపై ఐటీ దాడులు జరగకుండా ఉండేందుకే జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లారని అన్నారు. ఈ ఐటీ దాడుల నుంచి తనవారిని రక్షించుకునేందుకే అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకు పరిగెత్తుకు వెళ్లారని ఆరోపించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన సంస్థలపై ఐటీ దాడులు జరిగితే వైసిపి నేతలు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. జగన్ మాఫియా అబద్ధాలకు హద్దు అదుపు లేకుండా పోతోందని అన్నారు. 

read more  రెండువేల కోట్ల బాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కు భాగం.: మంత్రులు

మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టించిన ఈ ప్రభుత్వం న్యాయస్థానంలో చివాట్లు తిన్నదని అన్నారు. అలాగే ఓ కేసు విషయంలో ఇవాళ డీజీపీనే న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.