పెళ్లింట విషాదం...రోడ్డు ప్రమాదంలో అబ్బాయ్, బాబాయ్ మృతి

కృష్ణా జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదాన్ని నింపింది. పెళ్లిపనులపై  బైక్ పై  వెళుతున్న అబ్బాయ్, బాబాయ్ లను బస్సు రూపంలో మృత్యువ కబళించింది. 

Road Accident at Krishna District

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం నక్కలపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారు జరిగిన రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. అమృతసాయి ఇంజినీరింగ్ కళాశాల బస్సు  మృత్య శకటంగా మారిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని పొట్టపపెట్టుకుంది.  

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని పెనుగంచిప్రోలుకు చెందిన రామ్ గోపాల్ సీఏ చదువుతున్నాడు. పెళ్లి పనుల నిమిత్తం అతడు నక్కలపేట కు చెందిన తన బాబాయ్ కళ్యాణపు హరికృష్ణతో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ఊరి శివారులో ప్రమాదానికి గురయ్యారు. 

read more  అదృశ్యమై 20 రోజులు: కాలువలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి కుటుంబం జలసమాధి

వీరు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా మితిమీరిన వేగంతో వచ్చిన కాలేజీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కూడా  బస్సు వేగం తగ్గకుండా వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో బైక్ పై వున్న అబ్బాయి, బాబాయ్ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. 

కేవలం ఒక వాహనం మాత్రమే వెళ్ళ గలిగిన దారిలో కళాశాల బస్సు అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఎదురుగా బస్సు వేగంగా వచ్చినా చుట్టూ ముళ్లకంచెలు వుండటం వల్ల తప్పించుకోలేక రామ్ గోపాల్, హరికృష్ణ మృతిచెందినట్లు తెలుస్తోంది.  

ఈ  ప్రమాదంపై సమాచారం అందుకున్న  పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

read more  ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి... ఎన్నో అనుమానాలు..

ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయానికి 30 మంది కళాశాల విద్యార్థులు బస్సులో ఉన్నారు. బస్సు మరి కాస్త ముందుకు వెళ్లి కరెంట్ స్తంభాలను ఢీకొట్టడం గానీ కందకంలో పల్టీ కొట్టడం గానీ జరిగివుంటే మరింత దారుణం జరిగి వుండేది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios