విజయవాడ భవానీపురంలో దారుణహత్యకు గురైన పద్మావతి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. దొంగతనానికి వచ్చిన ఆగంతకుడే ఆమెను దారుణంగా హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది.

గత నెల 31వ తేదీన పట్టపగలే మహిళ దారుణహత్యకు గురికావడంతో దీనిని సవాలుగా తీసుకున్న నగర పోలీస్ పోలీస్ కమీషనర్ హంతకుడి ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 

Also Read:మహిళను వివస్త్రను చేసి హత్య... క్షుద్రపూజలు చేశారంటూ.

ఈ క్రమంలో ఘటనా ప్రదేశంలో ఎలాంటి ఆధారాలు లభించకుండా కారం జల్లడం, కనీసం వేలిముద్రలు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి గమనించిన పోలీసులు ఇది ప్రొఫెషనల్ పనిగా నిర్థారించారు.

ఆ రోజున మృతురాలు ఆమె భర్త వెంకటేశ్వర్లు బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు హాజరై ఇంటికి తిరిగొచ్చారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ఏదో పనిపై బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునేందుకు ప్రయత్నించాడు. 

Also Read:సైనైడ్ ఇచ్చి భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్: డ్రామా చేశాడు

దీనిని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. పద్మావతి కేకలు వేస్తే స్థానికులు వస్తారని భావించిన ఆగంతకుడు ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం పద్మావతి మెడలో ఉన్న గొలుసు, నల్లపూసల దండ, చేతికి వున్న నాలుగు బంగారు గాజులను అపహరించుకుని పోయాడు.

సీసీ కెమెరా ఫుటేజ్, ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకీని కనుగొన్నట్లు సమాచారం. నిందితుడి స్వస్థలం విజయవాడేనని... హత్య చేసిన అనంతరం అతను నగరాన్ని విడిచి రాయలసీమ ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత ఏలూరు తదితర ప్రాంతాల్లోనూ తిరిగినట్లు పోలీసులు గుర్తించి, ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.