Asianet News TeluguAsianet News Telugu

మహిళను వివస్త్రను చేసి హత్య... క్షుద్రపూజలు చేశారంటూ..

 ఆమె గొంతు కోసం హత్య చేసినట్లు శవాన్ని చూస్తే అర్థమౌతోందని పోలీసులు చెబుతున్నారు. సదరు మహిళ మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన శాంతిరవి ముదిలియార్ గా అక్కడ దొరికిన ఆధారాలను పట్టి గుర్తించారు. మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానిక పోలీసులు చెప్పారు.

Maharstra  woman brutally murdered in nallamalla forest
Author
Hyderabad, First Published Feb 3, 2020, 2:03 PM IST

నాగర్ కర్నూలు లో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన మహిళ వివస్తగా.. శవమై కనిపించింది.  ఆ శవం పక్కనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కూడా కనిపించడం గమనార్హం.

ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అభయారణ్యంలో ఉన్న ఆమ్రాబాద్ మండలం ఈగలపెంటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతట్టు అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. వివస్త్రై పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిజేశారు.

Also Read వివాహేతర సంబంధం.. భార్య ట్యాబ్లెట్స్ లో సైనేడ్ కలిపి.....

కాగా... ఆమె గొంతు కోసం హత్య చేసినట్లు శవాన్ని చూస్తే అర్థమౌతోందని పోలీసులు చెబుతున్నారు. సదరు మహిళ మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన శాంతిరవి ముదిలియార్ గా అక్కడ దొరికిన ఆధారాలను పట్టి గుర్తించారు. మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానిక పోలీసులు చెప్పారు.

అయితే... ఈ హత్య ఎవరు చేశారనే విషయం మాత్రం తెలియలేదు. గతంలో కూడా ఇలాంటి దారుణాలు అక్కడ చోటుచేసుకున్నాయని.. ఇప్పటికీ వాటి మిస్టరీ తేలలేదని పోలీసులు చెబుతున్నారు. 2019 లో శ్రీశైలం డ్యాం సమీపంలో ఒక వ్యక్తి హత్యకు గురవ్వగా, ఇప్పటి వరకు ఆ  వ్యక్తి ఎవరో తెలియకపోవడం గమనార్హం.

లోతట్టు అటవీ ప్రాంతంలో అక్కమహాదేవి గుహలను సందర్శించి అక్కడి నుంచి శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా క్రూర మృగాలు సంచరించే ఈ ప్రాంతం గుండా సమూహాలుగా కాలినడకన చేరుకుంటారు. 

ముఖ్యంగా శివరాత్రి, ఉగాది సమయంలో అక్కమహాదేవి గుహలకు కాలినడక చేరుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే.. దాదాపు 50ఏళ్ల వయస్సు ఉన్న మహారాష్ట్రకు చెందిన మహిళ ఒంటరిగా ఈ మార్గం గుండా అక్కమహాదేవి గుహలకు వెళ్లే అవకాశాలు మృగ్యమని చెప్పుకోవాలి.

ఒక వేళ ఆమె కుటుంబ సహ్యులతో కలిసి ఈ మార్గం గుండా వెళ్లి ఉంటే ఆమె తప్పిపోయిన బంధువులు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చేవారు. ఈ కేసులో అలాంటి పరిస్థితి లేదు. శవం పక్కన పసుపు, కుంకుమ, నిమ్మకాయ వంటివి ఉన్నాయి. క్షుద్రపూజల పేరుతో సదరు మహిళను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios