విజయవాడ: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెం-చాగంటంపాడు గ్రామాల మధ్యలో దారుణం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి 
కరకట్టపై నుంచి కేఈబీ కెనాల్ లోకి దూసుకోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కోసూరి శ్రీనివాస్ (38) అనే డాక్టర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే కారులోనే వున్న అతడి భార్య, కుమారుడు మాత్రం సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... అవనిగడ్డకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆంధ్ర హాస్పిటల్ లో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి విజయవాడలోనే నివాసముంటున్నాడు. రేపు ఆదివారం సెలవురోజు కావడంతో భార్యా, కుమారుడితో కలిసి స్వస్ధలానికి కారులో బయలుదేరాడు. 

read more కర్నూల్ లో పసికందు కిడ్నాప్... రెండు గంటల్లోనే చేధించిన పోలీసులు

అయితే వీరు ప్రయాణిస్తున్న కారు చాగంటిపాడు వంతెన దగ్గర ప్రమాదానికి గురయి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదాన్నిగమనించిన స్థానికులు కారులో వున్న అతడి భార్య, కుమారుడిని ప్రాణాలతో బయటకు తీశారు. వారిద్దరూ ఎలాంటి గాయాలు కాకుండా  సురక్షితంగా బయటపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి ప్రమాదంపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

read more  'పరిటాల హత్య జేసి కుట్రే... తుపాకులు సమకూర్చింది ఆయనే...''

ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డా భర్త మృతిచెందడంతో  శ్రీనివాస్ భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అలాగే మృతుడి తల్లిదండ్రులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.