కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పసిపాప కిడ్నాప్ కలకలం రేపింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ కు గురయిన తొమ్మిది రోజుల పసికందును తల్లి ఒడికి చేర్చారు. కేవలం రెండు గంటల్లోనే  ఈ కిడ్నాప్ ను ఛేదించిన కర్నూల్ పోలీసులను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన నిందితురాలిని అదుపులోనికి తీసుకుని కటకటాల వెనక్కి  తోశారు. 

ఈ కిడ్నాప్ కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గోనెగండ్ల మండలం చిన్ననేలటూర్  గ్రామానికి చెందిన మరియమ్మ తొమ్మిదిరోజుల క్రితం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అయిన తర్వాత మూడు రోజులకే ఆస్పత్రి నుండి  డిశ్చార్జీ అయినా ఇటీవలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మళ్లీ ఆస్పత్రిలో  చేరారు. 

read more  ''పరిటాల హత్య జేసి కుట్రే... తుపాకులు సమకూర్చింది ఆయనే...''

తన 9 రోజుల ఆడ శిశువును తీసుకొని తన చెల్లి పుష్పావతి, తమ్ముడు జగదీష్ తో కలిసి కర్నూల్ కర్నూల్ గవర్నమెంటు ఆసుపత్రిలోని చిన్న పిల్లల వార్డు వద్దకు ఉదయము 7 గంటలకు వెళ్ళింది. అప్పటికి  డాక్టర్లు రానందున ఆసుపత్రి ముందే బిడ్డను పెట్టుకొని ఉండగా ఆ సమయములో ఒక మహిళ వారిని పరిచయం చేసుకుంది. తనది గుత్తి అని తన తోటి కోడలిని డెలివరీ కొరకు తీసుకొచ్చినట్లు నమ్మిచింది.  

ఈ క్రమంలో మరియమ్మను మాటలతో మాయచేసి శిశువు ను తీసుకొని ఆటోలో పరారయ్యింది. దీంతో ఆస్పత్రి చుట్టుపక్కల ఆమె జాడ కోసం వెతికానా ఫలితం లేకపోవడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న కర్నూల్ పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేశారు.

read more  నీటి కాలువలోకి దూసుకెళ్లిన కారు... డాక్టర్ మృతి, భార్యాబిడ్డలు సురక్షితం

జిల్లా పోలీసు వాట్సాప్ గ్రూపులో ఫోటోలు చూసిన ప్యాపిలి ఎస్ఐ  మారుతి శంకర్ ఓ మహిళ పాపతో కనిపించడాన్ని గమనించాడు. అనుమానముతో ఆ పాప ఎవరి పాప అని అడుగగా ఆమె సరయిన సమాదానం చెప్పలేకపోవడంతో పాప ఫోటోను తీసి కర్నూల్ త్రీటౌన్ పోలీసులకు వాట్సాప్ లో పంపించాడు. దీంతో వారు ఆ ఫోటోను   తల్లి మరియమ్మకు చూపించగా తన బిడ్డగా గుర్తించింది.

 దీంతో మహిళ వద్దగల శిశువును పోలీసుల ఆదీనములోకి తీసుకుని కర్నూల్ ఎస్పీ కార్యాలయానికి చేర్చారు. అక్కడ జిల్లా ఎస్పీ  పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.   ఈ కిడ్నాప్ కు పాల్పడిన చంద్ర కళావతి ప్యాపిలి వసతి గృహములో వంటమనిషిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను ఇంకా విచారణ పూర్తి కానందున కిడ్నాప్ చేసిన వివరములు తెలియవలసి ఉంది. ఇటువంటి ఘటనలు  మరోసారి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.