''పరిటాల హత్య జేసి కుట్రే... తుపాకులు సమకూర్చింది ఆయనే...''
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం సృష్టించిన టిడిపి నాయకులు పరిటాల రవి హత్య గురించి వైసిపి నాయకులు కందిగోపుల మురళి కీలకవ్యాఖ్యలు చేశారు.
అనంతపురం: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన రాజకీయ హత్యల్లో టిడిపి నాయకులు పరిటాల రవి మర్డర్ ఒకటి. పార్టీ కార్యాలయంలోనే ఆయన్ని అత్యంత దారుణంగా కాల్చి చంపారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే ఈ దారుణానికి పాల్పడినట్లుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు రాజకీయ నాయకులెవ్వరి హస్తం ఉన్నట్లు భయపడలేదు. తాజాగా మరోసారి ఈ హత్యతో అనంతపురం జిల్లాకే చెందిన కీలక నాయకుడు జేసి దివాకర్ రెడ్డి హస్తముందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కందిగోపుల మురళి సంచలన కామెంట్స్ చేశారు.
పరిటాల రవి హత్యకు ఉపయోగించిన తుపాకులను దుండగులకు సమకూర్చింది అప్పటి కాంగ్రెస్ నాయకులు జేసి దివాకర్ రెడ్డియే అని మురళి ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే ఈ హత్యకు ఆయన సహకరించారని అన్నారు. పరిటాల రవి కీలక నాయకుడిగా ఎదగడమే ఈ హత్యకు కారణమని మురళి పేర్కొన్నారు.
read more పరిటాల ఇంట శుభకార్యం.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
ఈ విషయాన్ని పసిగట్టిన పరిటాల సునీత తండ్రి జేసి పాత్రపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ కోణంలో విచారణ జరపలేదన్నారు.
గతంలో తాను జేసి దివాకర్ రెడ్డి వద్ద కొంతకాలం పనిచేశానని...ఆయన క్రిమినల్ వ్యవహారాల గురించి బాగా తెలుసని మురళి వెల్లడించాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ ను ప్యాక్షనిస్ట్ అనడం... నోటికొచ్చినట్లు విమర్శలు చేయడం తగదన్నారు. జగన్ పై విమర్శలు చేసే హక్కు జేసికి లేదన్నాడు. ఆయన క్రిమినల్ రాజకీయాల గురించి బయటపెట్టడానికి సిద్దంగా వున్నానని...దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మురళి సవాల్ విసిరారు.
read more భార్యాపిల్లలు అడుక్కుతింటే జగన్ ఈగో శాంతిస్తుంది...: భూముల లీజు రద్దుపై జేసి