విజయవాడ: ఇసుక కొరత అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదాన్ని రాజేస్తోంది. ఈ  కొరతకు మీరంటే మీరు కారణమంటూ అధికార ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి దేవినేని ఉమ,  మైలవరం వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లు మాటలయుద్దానికి దిగారు. 

ఇటీవల టిడిపి నాయుకులు ఉమ ఇసుక కొరతపై మాట్లాడుతూ స్థానిక వైసిపి ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ప్రజలకు ఇసుక అందకుండా  సొంత లారీల్లో దాన్ని తరలిస్తున్న వసంత కృష్ణ ప్రసాద్ పై దేవినేని విరుచుకుపడ్డాడు. ఈ ఆరోపణలపై తాజాగా కృష్ణప్రసాద్ స్పందించారు. 

నాకు లారీలు గాని ఇసుక వ్యాపారంలో వాటాలు ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని అన్నారు. నిరూపించే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు.. ఒకవేళ నిరూపించలేకపోతే మీరేం చేస్తారో చెప్పాలని మాజీ మంత్రిని ప్రశ్నించారు. 

read more  భవన నిర్మాణ కార్మికులకు జనసేన అండ... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

తాను అగర్బశ్రీమంతుడినని ఎప్పుడైనా చెప్పలేదన్నారు. ఆయనలా పిచ్చి పిచ్చిగా వాగే అలవాటు తనకు లేదన్నారు. ఈడి కేసులో ముద్దాయిలు అంటూ మతిలేని మాటలు మాట్లాడటం మానుకోవాలన్నారు. 

ఆయనలా తనకు పదవులు పిచ్చి లేదని పేర్కొన్నారు. ప్రజా తీర్పు కోసం ఎదురు చూసి వారి ఆశిస్సులతో నీతి నిజాయితీగా పనిచేస్తున్నానన్నారు. ఆయనలా  ఇసుక, నీరు- చెట్టు మైనింగ్ మాఫియా లీడర్ గా వ్యవహరించి అధికారంలోకి రాలేదన్నారు. 

మైలవరంలో ఆయన డీ గ్యాంగ్ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని... అందుకే ప్రజలు గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని... బుద్ధి మార్చకుంటే మంచిదన్నారు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు వాగితే ఈసారి తానే తగిన గుణపాఠం చెబుతాను కృష్ణప్రసాద్ హెచ్చరించారు. 

read more  ఇసుక కొరతకు జగన్ ప్రభుత్వం చెక్...

దేవినేని ఉమకు బురదగుంటలో పొర్లాడే పందికి పెద్ద తేడా లేదంటూ ఘాటు పదజాలంతో విమర్శించారు. మతిలేని మాటలు మానుకొకపోతే నేరుగా వచ్చి ఆయన  సంగతి తేల్చేయడం జరుగుతుందని హెచ్చరించారు. 

మైలవరం నియోజకవర్గం లో దోపిడీ లక్ష్యంగా ఆయన పని చేశారని.. అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. దేవినేని ఉమ పిచ్చి వాగుడు మానుకొకపోతే నియోజకవర్గ ప్రజల సమక్షంలోనే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని కృష్ణ ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.