Asianet News TeluguAsianet News Telugu

ఇసుక కొరతకు జగన్ ప్రభుత్వం చెక్...

ఆంధ్ర ప్రదేశ్ గతకొంతకాలంగా నెలకొన్న ఇసుక కొరత జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే ఈ గడ్డుకాలం నుండి రాష్ట్రం మెల్లమెల్లగా తేరుకుంటున్నట్లు అధికారులు వెల్లడించిన తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.  

sand supply details  in andhra pradesh
Author
Amaravathi, First Published Nov 8, 2019, 9:16 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  గతకొంత కాలంగా నెలకొన్న తీవ్ర ఇసుక కొరతయకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెక్ పెట్టింది. వరదల కారణంగా ఇంతకాలం ఇసుక తవ్వకాలు నిలిచిపోగా  ప్రస్తుతం భారీ ఎత్తును ఇసుక తవ్వకాలను చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో గతంతో పోలీస్తే ఇసుక సమస్య చాలావరకు తగ్గినట్లు ప్రభుత్వం వెల్లడించారు. 

రాష్ట్రంలోని అన్ని నదుల్లో  వరదనీటి ఉదృతి తగ్గుముకం పట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా ఇసుక సరఫరా పెరిగినట్లు ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ ఇసుక సరఫరా వారం రోజుల వ్యవధిలోనే దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 

ఇసుక సరఫరా  నవంబరు 1 న 31,576 టన్నుల సరఫరా వుండగా నవంబరు 7 నాటికి 86,482 టన్నులకు పెరింగింది. ఇక ఇవాళ అంటే నవంబరు 8నాటికి  అది 96 వేల టన్నులకు చేరుకుంది. మరో రెండు రోజుల వ్యవధిలోని ఈ సరఫరా లక్ష టన్నులను చేరుకోనుందని అధికారులు తెలిపారు. 

నదుల నుండి మొదటి ఆర్డ్‌ర్, రెండో ఆర్డర్, మూడో ఆర్డర్‌ కింద ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. వరుస స్ట్రీమ్స్‌లో 300 పైగా రీచ్‌లు గుర్తించినట్లు...నదుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న కొద్ది మరిన్ని ఎక్కువ రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. 

read more  ఇసుక ధరను నిర్ణయించే అధికారం వారికే... హద్దుదాటితే జైలే...: జగన్

ఇటీవలే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు  తీసుకోవాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ అంశం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో సీఎం కేవలం దీనిపై చర్చించేందుకే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీచేశారు.

ముఖ్యంగా ఇసుక ధరలకు కళ్లెం వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ ను కూడా సిద్ధంచేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని కలెక్టర్లను ఆదేశించాలని గనులశాఖ అధికారులకు సూచించారు. ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాలన్నారు. ఏ జిల్లా, ఏ నియోజకవర్గాల్లో ఎంత రేటు పెట్టాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని అధికారులను  ఆదేశించారు. 

రేటు నిర్ణయించాక ధరలను ప్రకటించాలని... నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలన్నారు. నిర్ణయించిన రేటుకే ఇసుకను అమ్మాలని... ఈలోగా ఇసుక సరఫరాను బాగా పెంచాలని సూచించారు. ఇందుకోసం ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ను కూడా పెట్టాలని సూచించారు.

ఇసుకను అధిక రేటుకు అమ్ముతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుని జైలుకు పంపాలన్నారు. ఒక్క రవ్వకూడా అవినీతికి తావులేకుండా చేస్తున్నామని... అయినా సరే మనం విమర్శలకు గురవుతున్నామని సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి దూరంగా ఉన్నారని...అయినా సరే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.

read more చంద్రబాబు ఇసుక దీక్ష... ఇందిరాగాంధీ స్టేడియంలో కాకుంటే అక్కడే...: టిడిపి ఎమ్మెల్సీ

వచ్చే వారం స్పందన నాటికి ఈ రేట్లు, టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రకటించాలని ఆదేశించారు. వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహిస్తామన్నారు. స్పందనలో ఇసుక వారోత్సవం తేదీల ప్రకటిస్తామని  తెలిపారు.

రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మగ్లింగ్‌ చేయకూడదరని... టెక్నాలజీని వాడుకోని దీన్ని నివారించాలన్నారు.   స్మగ్లింగ్‌ జరిగితే చెడ్డపేరు వస్తుందన్నారు. చెక్‌పోస్టుల్లో టీంలు, మొబైల్‌ టీంలను పెంచుతామని అధికారులు సీఎం తెలిపారు. ప్రత్యేక టీంలను కూడా పెంచుతామన్న అధికారులు  తెలిపారు.

 చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఉండేందుకు వీలుగా కనీస సదుపాయాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రైడ్స్‌ చేయాలి... కేసులు పెట్టాలి... తప్పు చేసిన వారిని విడిచిపెట్టకుండా జైలుకు పంపాలన్నారు. ఇది జరిగితే ఖచ్చితంగా పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios