విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టిడిపి నాయకులు, విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద భారీగా మొహరించిన పోలీసులు ఆయన్ను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం పోలీసులు వ్యవహరుస్తున్న తీరు ఆ డిపార్ట్మెంట్ కే మాయని మచ్చగా మిగులుతుందని అన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని ఇలా గృహ నిర్బంధంలో  వుంచడం మంచిపద్దతి కాదన్నారు. నేరస్తుడి మాదిరిగా తనతో పోలీసులు వ్యవహరించారని... అసలు తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో  పోలీసులు, ప్రభుత్వం  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

read more  తన గోరీ తానే కట్టుకుంటున్న ఏకైక నాయకుడు జగన్: కళా వెంకట్రావు

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని... పోలీసులను వాడుకుని ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని అన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ ఆడమన్నట్లు ఆడుతున్నారని... ఇలాగే కొనసాగితే పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. 

అమరావతి ప్రజల రాజధాని అని....అటువంటి రాజధానిని మార్చడం జగన్ వల్ల కాదని ఎంపీ అన్నారు. పిచ్చి పిచ్చి కమిటీలు వేసి ప్రజలను మోసం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని... ఆ ప్రయత్నాలేవీ సాగవన్నారు. 

read more  ఏపీ క్యాబినెట్ సమావేశాలు : పోలీసుల పహారాలో ప్రకాశం బ్యారేజ్

రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.  ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలని ప్రజల కోరుతున్నారని... కాబట్టి ఇక్కడే రాజధాని కొనసాగేలా నిర్ణయం తీసుకునే వరకు టిడీపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఎంపీ నాని అన్నారు.