అమ్మఒడి వల్ల నష్టపోయేది బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాలే... ఎలాగంటే: అచ్చెన్నాయుడు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం పేరుతో రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల పొట్టకొడుతోందని టిడిపి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  

kinjarapu atchennaidu shocking comments on ammaodi  scheme

అమరావతి: ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్ర సమయంలో వైసిపి అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్‌రెడ్డి బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్ధికి అమ్మ ఒడి పథకాన్ని అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాటమార్చారని టిడిపి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మ్యానిఫెస్టోలో పిల్లలందరిని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15,000 ఇస్తామని హామీనిచ్చారని గుర్తుచేశారు. తీరా అమలులో మాత్రం అమ్మ ఒడి పథకాన్ని పిల్లలందరికి వర్తింపజేయకుండా మాటతప్పి మడమ తిప్పారని అన్నారు. 

అధికారంలోకి రాక ముందు జగన్ చదువుకునే ప్రతి పిల్లవాడికి ఈ పథకాన్ని అమలు చేస్తానన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం ప్రభుత్వం పాఠశాలలో చదువుకునే వారికే అన్నారు. ఆ తరువాత ఇంటిలో కేవలం ఒక్క విద్యార్ధికే అన్నారు. ఇప్పుడు రేషన్‌ కార్డు ఉన్న వారే అర్హులు, 300 యూనిట్లు దాటిన వారికి వర్తించదు, టాక్స్‌ కడుతున్న వారికి వర్తించదు, గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.20 లక్షలు, పట్ణణాల్లో రూ.1.44 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు ఇలా అమ్మ ఒడిని అనేక ఆంక్షల సుడిగా మార్చారని అచ్చెన్నాయుడు తెలిపారు.

read more  అమరావతిలో పోలీస్ కాల్పులు... చంద్రబాబు ప్రయత్నమదే: బొత్స సంచలనం

ఈ పథకం తీరు తెలియకా ప్రజలు మల్లగుల్లాలు పడుతున్నారని అన్నారు. అదే విధంగా 1 నుండి ఇంటర్మీడియట్‌ వరకు అమలు చేస్తామన్నారు కాని తత్సానమైన ఐటీఐ, డిప్లమో, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 

పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అమ్మ ఒడిని అమలు చేస్తామని నవంబర్‌ 11, 2019న జారీ చేసిన జీవో నెం.79లో సుస్పష్టంగా ఉందన్నారు. దీని ప్రకారం 82 లక్షల మంది విద్యార్దులకు గాను కేవలం 43 లక్షల మంది విద్యార్ధులకు ఇవ్వడం జగన్మోహన్‌రెడ్డి మాట తప్పడం, మడమ తిప్పడం కాదా అని నిలదీశారు.

read more  వాహనం ఎక్కించి రైతుల్ని చంపాలన్నదే వారి కుట్ర... కానీ...: నారా లోకేశ్

''1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు పిల్లలను తల్లులు బడికి పంపించండి. ఒక్కో పిల్లవాడికి నెలకు రూ. 500 చొప్పున ఇద్దరికి రూ. 1000, 6 నుంచి 10 వ తరగతి వరకు ఒక్కో పిల్లవాడికి రూ. 750 చొప్పున ఇద్దరికి నెలనెలా రూ. 1500,  ఇంటర్మీడియట్‌ పిల్లలకు నెలకు రూ. 1000 చొప్పున ఇద్దరికి రూ. 2 వేలు ఇస్తాను అని ప్రతిపక్ష నేతగా జగన్‌ జూలై  08, 2017 న గుంటూరులో జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రకటించారు'' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

''1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న పిల్లలకు సంబందించి ఒక్కో తల్లికి సంవత్సరానికి రూ. 12 వేలు,  6 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న  పిల్లలకు సంబందించి ఒక్కో తల్లికి సంవత్సరానికి రూ 18 వేలు, ఇంటర్మీడియట్‌  చదువుతున్న ఒక్కో విద్యార్ధి తల్లికి సంవత్సరానికి రూ. 24 వేలు చెల్లించాలి'' అని అన్నారు. 

2019-20 బడ్జెట్‌లో కేవలం రూ. 6,445 కోట్లు మాత్రమే అమ్మఒడికి కేటాయించినట్లు తెలిపారు. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కొత్త పధకాన్ని ప్రారంభిస్తే నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తారు కాని అమ్మ ఒడి పథకానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను మళ్లించి ఖర్చు చేయడం వెనుకబడిన వర్గాల పొట్టకొట్టడమే అవుతుందని కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios