వాహనం ఎక్కించి రైతుల్ని చంపాలన్నదే వారి కుట్ర... కానీ...: నారా లోకేశ్

ఇటీవల అమరావతి రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిపై టిడిపి జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

farmers attack on ysrcp mla pinnelli.... nara lokesh shocking comments

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయాలని చూస్తున్న వైసిపి ప్రభుత్వం దారుణాలకు పాల్పడేందుకు వెనుకాడటం లేదని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇటీవల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రాజధాని రైతులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారని... అయితే అయన చేసిన దారుణ ప్రయత్నం గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేని రావద్దని రైతులు దండం పెడితే వారిపై కారు ఎక్కించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 

మందడంలో రైతులు చేపట్టిన నిరసనలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత 23రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా కనీసం వారి గోడు వినిపించుకునే వారుకూడా ప్రభుత్వంలో ఎవ్వరూ లేరన్నారు. రాజధాని కోసం రైతులు మరణిస్తే కూడా స్పందించరా అని లోకేశ్ నిలదీశారు.  

2014 లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. కష్టించి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే కట్టుబట్టలతో తరిమేశారని అన్నారు. నాటి పాలకులు హైదరాబాద్ ని పది సంవత్సరాలు రాజధానిగా ఇచ్చారు కానీ చంద్రబాబు సొంతగడ్డ నుంచి పాలించేందుకు మొగ్గు చూపి రాజధానిని నిర్మించడానికి పూనుకున్నారని అన్నారు.  రాయలసీమ, ఉత్తరాంధ్రా,  ఇలా అన్ని జిల్లాలకు అనుకూలమైన ప్రాంతాన్ని రాజధాని కోసం ఎంపిక చేశారని తెలిపారు. 

అమరావతిలో అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం సౌకర్యాలు ఉన్నాయని ఇక్కడ భూములు తీసుకున్నారన్నారు. బలవంతంగా భూములు తీసుకున్నారని విమర్శలు చేయడాన్ని లోకేశ్ తప్పుబట్టారు.  

read more  అమరావతిలో పోలీస్ కాల్పులు... చంద్రబాబు ప్రయత్నమదే: బొత్స సంచలనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో గెలిచి రాష్ట్ర వికేంద్రీకరణ అంటూ ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు కోరుకున్నారని పేర్కొన్నారు.ఆనాడు రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు తెచ్చిన సంస్థలు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. సింగపూర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి చేస్తామని వస్తే సీఎం జగన్ కలవకుండా పంపించేశారని అన్నారు.

''తెలంగాణ ప్రభుత్వం మనం వద్దన్నవెంటనే ఆ పరిశ్రమలను తీసుకెళ్లి తమ రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు. రియలెన్స్ కంపెనీ తిరుపతిలో పెడదామని ముందుకు వస్తే  దాన్ని బినామీ కంపెనీ అంటున్నారు. దాన్ని కూడా పో.పో అన్నారు దీంతో వెళ్లిపోయింది. లూలు గ్రూపు 25 వేల మందికి ఉద్యోగాలు, రూ 2500కోట్ల పెట్టుబడితో వస్తే వారిని వెళ్లగొట్టారు
'' అని లోకేశ్ ఆరోపించారు. 

''ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని కోసం బయటకి రాని వారు నేడు రోడ్ల మీదకి వచ్చారు. రైతులపై తొమ్మిది సెక్షన్ల కింద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నా. ఆనాడు రావాలి జగన్ కావాలి జగన్ అన్నవారే ఇప్పుడు పోవాలి జగన్..పోవాలి జగన్ అంటున్నారు. డమ్మీ కాన్వాయ్ తో వెళ్తున్న ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నా'' అని ఎద్దేవా చేశారు.

read more  పార్టీ కోసం ప్రభుత్వ నిర్ణయాన్నే జగన్ తుంగలో తొక్కాడు...: యనమల

''మేనిఫెస్టో లో అమరావతి గురుంచి ఎందుకు రాయలేదు. రైతులకు ప్లాట్లు ఇచ్చిన తరవుతే మనం ఇల్లు కట్టుకుందామని చంద్రబాబు చెప్పారు.  రాజధానిలో వరదలు వచ్చాయా.. విశాఖలో, శ్రీకాకుళం లో వచ్చాయా. అవగహన లేకుండా మాట్లాడొద్దు. అధికార పార్టీ నాయకులకు అమరావతిలో దళిత రైతులు ఉన్న సంగతి మర్చిపోయారు.  అమరావతిని చంపేసేందుకే ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు'' అని లోకేశ్ ఆరోపించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios