కేసులు ఎవరు పెట్టారో చంద్రబాబును అడగండి: చింతమనేనికి ఆళ్లనాని సూచన

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత అధిగమించామని... మీ పాలనలో ఇసుక దోచుకుని ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆయన ధ్వజమెత్తారు. 

deputy cm alla nani slams ex tdp mla chintamaneni prabhakar over his police cases

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత అధిగమించామని... మీ పాలనలో ఇసుక దోచుకుని ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆయన ధ్వజమెత్తారు.

అక్రమ ఇసుక రవాణా ద్వారా లోకేష్ కు ముడుపులు చెల్లించారని.. ఇసుక రవాణా అడుకున్న వనజాక్షి పై దాడు చేస్తే ముఖ్యమంత్రి కార్యాలయంలో సెటిల్ మెంట్ చేశారంటూ ఆళ్లనాని చురకలంటించారు. మీ పాలనలో మీ శాసన సభ్యులు ఇసుక దోచుకుని తిన్నారని... ఇసుక మాఫీ చేసి మరలా కప్పిపుచ్చుకొనేందుకు ఇసుక దీక్ష చేపట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

చింతమనేని పై నమోదు అయిన కేసులు అని టీడీపీ ప్రభుత్వం లో నమోదు అయినవేనని.. వాటిని దర్యాప్తు చేపట్టిన తర్వాతనే పోలీసులు అరెస్టు చేశారని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. మా ప్రభుత్వ హయంలో చింతమనేనిపై ఎటువంటి తప్పుడు కేసులు నమోదు చెయలేదని ఆళ్లనాని స్పష్టం చేశారు.

Also Read:ఎట్టకేలకు 66 రోజుల తర్వాత చింతమనేనికి బెయిల్

మీపై కేసులు నమోదు కావడానికి కారకులు ఎవరని చంద్రబాబుని అడగాలంటూ చింతమనేనికి ఉపముఖ్యమంత్రి సూచించారు. లాంగ్ మార్చ్ అంటూ పవన్ కల్యాణ్ వైజాగ్ లో చేశారని... మరి గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ఆళ్లనాని ప్రశ్నించారు.

పారదర్శకంగా ఇసుకను ప్రజలకు సరఫరా చేస్తున్న ప్రభుత్వం పై విమర్శలు సరికాదని ఆయన హితవు పలికారు. భవిష్యత్తులో ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ఆళ్లనాని స్పష్టం చేశారు. 

18 కేసులకు సంబంధించి చింతమానేనీ నానికి నేడు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్. ఎస్‌సి, ఎస్‌టి కేసుకు సంబంధించి 65 రోజులు ఏలూరు సబ్ జైల్ లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎం‌ఎల్‌ఏ చింతమా నేనీ. 

టి‌డి‌పి మాజీ ఎం‌ఎల్‌ఏ చింతమనేని నానికి బెయిల్ నేడు మంజూరు చేసింది. ఎస్‌సి, ఎస్‌టి కేసుకు సంబంధించి 65 రోజులు ఏలూరు సబ్ జైల్ లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎం‌ఎల్‌ఏ చింతమా నేనీ. 18 కేసులకు సంబంధించి చింతమా నేనీకి  నేడు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్ .

Also Read:బెయిల్ పై విడుదల: చింతమనేనికి చంద్రబాబు ఫోన్

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద నేత చింతమనేని ప్రభాకర్ కు  ఏలూరు కోర్టు తొలుతసెప్టెంబర్  25 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో దుగ్గిరాలలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios