Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు 66 రోజుల తర్వాత చింతమనేనికి బెయిల్

18 కేసులకు సంబంధించి చింతమానేనీ నానికి నేడు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్. ఎస్‌సి, ఎస్‌టి కేసుకు సంబంధించి 65 రోజులు ఏలూరు సబ్ జైల్ లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎం‌ఎల్‌ఏ చింతమా నేనీ. 

chintamaneni gets bail after 65 days of remand
Author
Hyderabad, First Published Nov 16, 2019, 6:13 PM IST

టి‌డి‌పి మాజీ ఎం‌ఎల్‌ఏ చింతమనేని నానికి బెయిల్ నేడు మంజూరు చేసింది. ఎస్‌సి, ఎస్‌టి కేసుకు సంబంధించి 65 రోజులు ఏలూరు సబ్ జైల్ లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎం‌ఎల్‌ఏ చింతమా నేనీ. 18 కేసులకు సంబంధించి చింతమా నేనీకి  నేడు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్ .

ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద నేత చింతమనేని ప్రభాకర్ కు  ఏలూరు కోర్టు తొలుతసెప్టెంబర్  25 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో దుగ్గిరాలలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  

also read నిన్ను ప్యాకేజీ స్టార్ అని కూడా అంటారు.. నువ్వే చెప్పు: పవన్ కళ్యాణ్ పై కోడలి నాని

చింతమనేని ప్రభాకర్ పై పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. 

ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో తనను అరెస్ట్ చేస్తారని భావించిన చింతమనేని ప్రభాకర్ చాలా కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సుమారు 12రోజుల అనంతరం ఆయన అజ్ఞాతం వీడారు. కుటుంబ సభ్యులను చూసేందుకు  దుగ్గిరాలలోని తన నివాసానికి చేరుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

also read అయప్ప మాలలో ఉండి కూడా వంశీ, అవంతీ చెప్పులేసుకుంటారు:వర్ల

అదుపులోకి తీసుకున్న పోలీసులు చింతమనేని ప్రభాకర్ ను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఏలూరు కోర్టులో హాజరుపరిచారు.  

ఇకపోతే పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేని ప్రభాకర్ పై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులే కాకుండా చింతమనేనిపై 10 కేసులు సైతం ఉన్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios