గుంటూరు: ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై కుట్రలు పన్నుతున్నాడంటూ టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే జగన్ తప్పుడు  నిర్ణయాలు తీసుకునేలా చేస్తూ అతడిని ప్రజలే ఛీ కొట్టెలా చేస్తున్నాడని అన్నారు. దీంతో అతడు సీఎం పదవిని కోల్పోగానే ఆ సీట్లో కూర్చోవాలని విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారని వెంకన్న వ్యాఖ్యానించారు. 

''పీపీఏ లను ముట్టుకొని తుగ్లక్ కి షాక్ కొట్టింది. పీపీఏల దెబ్బకి ప్రధాని దగ్గర నుండి అంతర్జాతీయ మీడియా దొబ్బులు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు.''

''పిపిఏల్లో అక్రమాలు జరిగినట్టు ఫినాయిల్ దొంగ సొమ్ముతో నడిచే సొంత వెబ్ సైట్స్ లో వార్తలు రాయించి, వాటినే నిజాలుగా నమ్మించి ప్రపంచ వ్యాప్తంగా తుగ్లక్ ని ఛీ కొట్టేలా చేసి ముఖ్యమంత్రి పదవి కొట్టేయాలి అని ఫినాయిల్ ప్లాన్ చేశాడు.'' అంటూ వెంకన్న ట్వీట్ చేశారు. 

read more  జగ్గు దాదా... పిల్లనిచ్చిన మామ చేయలేనిది దొంగమామ చేశాడుగా...: అచ్చెన్నాయుడు

''ఫెడరల్ ఫ్రంట్ లో ఊపేస్తా అన్నాడు. ఉన్న 43 వేల కోట్లలో కొంత ఖర్చు చేసి బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టాడు. ఉప ప్రధాని పదవి నాకే కావాలి అంటూ 2000 వేల కోట్లు ఫెడరల్ ఫ్రంట్ మిత్రులకు సమర్పించుకున్నాడు.''

''ఫెడరల్ ఫ్రంట్ ఫిడేల్ ఫ్రంట్ అయ్యేసరికి ఇప్పుడు బిజెపితో కాళ్ళ బేరానికి వెళ్ళాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఢిల్లీలోనే ఉంటా.. బిజెపిలో కలిసిపోవాల్సిందే అంటున్నాడు తుగ్లక్'' అని  సీఎం జగన్ ను వెంకన్న ఎద్దేవా చేశారు. 

''చంద్రబాబు గారికి అవినీతి మరక అంటించబోయి బీజేపీతో వైకాపా కలిసిపోతుంది అని ట్విట్టర్ ద్వారా ప్రకటించి విజయసాయి రెడ్డి గారు నాలుక కర్చుకున్నారు'' అంటూ మరో ట్వీట్ చేశారు. 

read more  టిడిపి శ్రేణులపై వేధింపులు... ఆ అధికారులపై పేర్లు రాసిపెట్టుకోండి...: చంద్రబాబు హెచ్చరిక

''మహా మేత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బంజారా హిల్స్ లో  ఉన్న స్థలాన్ని రెగ్యూలరైజ్ చెయ్యాలని చంద్రబాబు గారి దగ్గర ప్రాధేయపడ్డాడు. తుగ్లక్ రెడ్డి ఏమో 5 ఏళ్ల లోనే  43 వేల కోట్లకు పడగెత్తాడు. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న లాజిక్ సీబీఐ, ఈడీ పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు.''

''తీగ లాగితే డొంక కదిలింది. జైలు పిలుస్తుంది "కావాలి తుగ్లక్.. రావాలి తుగ్లక్" అని సిద్ధంగా ఉండండి విజయసాయి రెడ్డి  గారు'' అని సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలను బుద్దా వెంకన్న హెచ్చరించారు.