Asianet News TeluguAsianet News Telugu

టిడిపి శ్రేణులపై వేధింపులు... ఆ అధికారులపై పేర్లు రాసిపెట్టుకోండి...: చంద్రబాబు హెచ్చరిక

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సమయంలో అయినా అండగా ఉంటామని ఆ పార్టీ జాతీయాధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. 

Chandrababu  Strong Warning to YSRCP Leaders and Govt Officers
Author
Mangalagiri, First Published Feb 21, 2020, 4:07 PM IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను వేధించి, కష్టపెట్టిన వైసిపి నేతలు, ప్రభుత్వ అధికారుల పేర్లను నమోదు చేసుకోవాలని టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుందని... అది వచ్చినప్పుడు మనల్ని వేధించిన  వారి పనిపడదాం అంటూ టిడిపి కార్యకర్తలకు సూచించారు. 

రాజధాని అమరావతిలోనే ఉండాలని ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు పలకాలని కోరుతూ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ను అడ్డుకున్న యువకులపై పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అలా అమరావతి  ఉద్యమంలో భాగంగా జైలుపాలయిన నందిగామ యువకులు ఇవాళ(శుక్రవారం)  విడుదలయ్యారు. 

విడుదలయిన యువకులను ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు జైలు వద్దే కలుసుకుని మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు తీసుకువచ్చి చంద్రబాబుతో కలిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మంచి కోసం పోరాటం చేయడంలో తప్పేముందన్నారు. ఆనాడు మహాత్మాగాంధీ స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని విజయం సాధించారని గుర్తు చేశారు. 

read more  జగ్గు దాదా... పిల్లనిచ్చిన మామ చేయలేనిది దొంగమామ చేశాడుగా...: అచ్చెన్నాయుడు

అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా తమరు నిరసన దీక్షలో పాల్గొన్నప్పుడు నందిగామలో 20 మందిమి నిరాసనదీక్ష చేశామని యువకులు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. అప్పటి  నుంచి వైసిపి నేతలు, పోలీసు అధికారులు తమపై కక్ష గట్టారని తెలిపారు. ఆ నేపధ్యంలో ఎంపీ నందిగం సురేష్ రావడంతో తాము రాజధానికి మద్దతు కోరడంతో అది సాకుగా కేసులు బనాయించారని పేర్కొన్నారు. 

జైలులో తమను తల్లిదండ్రులు సైతం కలవనీయకుండా అన్నపానీయాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారని తెలిపారు. తమను అరెస్ట్ చేసిన ఎస్ఐ ని డీఎస్పీ కౌగిలించుకుని అభినందించారన్నారు. పోలీసు స్టేషన్ వద్ద సీసీ కెమెరాలను అమర్చి తమకోసం వచ్చే వారిపై నిఘా వేశారన్నారు. 

పోలీసు దుస్తుల్లో ఉండి వైసిపి కార్యకర్తలుగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తమను అరెస్ట్ చేసినప్పటి తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకున్నారని తెలిపారు. పోలీసులు తమను అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ లో డాన్స్ చేయడం ఆశ్చర్యం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

read more  వివాహ వ్యవస్థకే జగన్ దంపతులు కలంకం... శివరాత్రి రోజే...: అనిత వ్యాఖ్యలు

వైకాపా నేతల అరాచకాలు మితిమీరాయని అయినా ధైర్యంగా ఉండండని చంద్రబాబు అనునయించారు.  రాష్ట్రశ్రేయస్సు కోసం పరితపించే ఎవరికైనా తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios