జగ్గు దాదా... పిల్లనిచ్చిన మామ చేయలేనిది దొంగమామ చేశాడుగా...: అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలలో సొంత మామలు చేయలేని పని దొంగ మామ చేశాడంటూ మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశాడు.  

Kinjarapu Atchennaidu Shocking Comments On CM YS Jagan

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, తమిళనాడు వ్యాపారవేత్త శ్రీనివాసన్ పాత్ర విస్మరించలేనిదని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ కు పిల్లనిచ్చిన మామ, మేనమామ చేయలేని పనిని దొంగ మామ అయిన శ్రీనివాసన్ చేసిపెట్టాడంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''10 రూపాయల షేర్ ను, రూ 1440 పెట్టి కొనడానికి శ్రీనివాసన్ ఏమైనా నీకు పిల్లనిచ్చిన మామా..? మీ అమ్మకు తోడపుట్టిన నీ మరో మేనమామా..? నీ మామే (గంగిరెడ్డి) కొనలేదు ఒక్కో షేర్ అంత రేటు పెట్టి..!! ఇక నీ మేనమామ(రవీంద్రనాధ రెడ్డి) కోనేరకం ఎటూ కాదు ఆ రేటుకు..!!!''

''మరి ఈ “దొంగ మామ” ఎలా కొన్నాడు రూ 1440 రేటుకు చెప్మా..? సిబిఐ భారతి (సిమెంట్)తీగ లాగింది, ఈడీ దెబ్బకు నీ డొంకలన్నీ కదిలాయా ''జగ్గు దాదా''...'' అంటూ భారతి సిమెంట్, ఇండియా సిమెంట్ సంస్థల మధ్య  జరిగిన లావాదేవీలపై సంచలన ట్వీట్స్ చేశారు అచ్చెన్నాయుడు.

read more  వివాహ వ్యవస్థకే జగన్ దంపతులు కలంకం... శివరాత్రి రోజే...: అనిత వ్యాఖ్యలు

 వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో తొలిసారి ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయిన విషయం తెలిసిందే. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేర్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).   

భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ మూడు చార్జిషీట్లు (సీసీ 14/2012, సీసీ 24/2013, సీసీ 25/2013) దాఖలు చేసింది. ఈడీ తన చార్జీషీటులో మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలు చేసింది.

read more  మహిళలు స్నానం చేస్తుండగా పోలీసుల డ్రోన్ కెమెరాలు... డీఎస్పీ వివరణ

ఈ చార్జీషీటులో జగన్‌, భారతితోపాటు ఆడిటర్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి, భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌, జెల్లా జగన్‌మోహన్‌ రెడ్డి (జేజే రెడ్డి), సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యూటోపియా ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగతవ్‌ సన్నిధి ఎస్టేట్స్‌తోపాటు గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఐబీఎంకు చెందిన వి.ప్రభు షెట్టార్‌, మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర నారాయణను నిందితులుగా పేర్కొంది.
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios