సంతలో పశువుల్లా టిడిపి నాయకుల కొనుగోలు... దమ్ముంటే అలా చేయ్: జగన్ కు బుద్దా సవాల్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టిడిపి నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు.
గుంటూరు: స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. గతంలో నీతులు చెప్పిన సీఎం ఎన్నికలు రాగానే టిడిపి నాయకులను సంతల్లో పశువులు కొన్నట్లు కొంటున్నారని అన్నారు. దమ్ముంటే మద్యం, డబ్బు పంపిణీ లేకుండా ఎన్నికలు నిర్వహించాలని బుద్దా సవాల్ విసిరారు.
''వైఎస్ జగన్ దొంగల బ్యాచ్ కు ఇది జీవన్మరణ పోరాటం. 151 అని కాలర్ ఎగరేసి 10 నెలలు కాకముందే గెలవకపోతే తాటతీస్తా అనే పరిస్థితి వచ్చింది అంటే పాలన ఎంత దరిద్రంగా ఉందో ఆయనే ఒప్పుకున్నాడు. వైకాపా చేసే చెత్త పనులు మన మీద నెట్టడానికి బ్లాక్ మీడియా గుంట నక్క లా ఎదురుచూస్తుంది''
''వాలంటీర్లతో జగనన్న మద్యం, డబ్బు పంపిణి మొదలెట్టారు. పసుపు సైనికులు ఎప్పటికప్పుడు వైకాపా అరాచకాలను ప్రపంచానికి చూపించాలి''
''వైఎస్ జగన్ గారు ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారా? వాటిని దేశమంతా ఆసక్తిగా గమనిస్తుందా? జగనన్న మద్యం దుకాణాలు ప్రారంభించి ఎన్నికల్లో మద్యాన్ని ఏరులై పారించడాన్ని సంస్కరణ అంటారా?'' అంటూ ముఖ్యమంత్రి జగన్ పై వెంకన్న విమర్శలు గుప్పించారు.
read more జాతీయ జెండా దిమ్మెకు వైసిపి రంగులు... బొత్సకు చెంపపెట్టు...: అనురాధ ఫైర్
''దేవుడి స్క్రిప్ట్ అంటూ కబర్లు చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను సంతలో పశువుల్లా కొనడాన్ని దేశమంతా ఆసక్తిగా చూస్తుందా? వాలంటీర్ల తో జగనన్న మద్యం, డబ్బు డోర్ డెలివరీ చేస్తున్నందుకు ఆదర్శంగా తీసుకోవాలా సాయిరెడ్డి గారు?''
''5 కోట్ల ఆంధ్రులు తుగ్లక్ అని నినదిస్తుంటే పలాయనం చిత్తగించి గెలవకపోతే దించేస్తా అని నాయకులను బెదిరించే దుస్థితికి చేరుకున్నాడు జగన్. దమ్ముంటే ఈ నెల జగనన్న మద్యం దుకాణాలు మూతవేసి ఎన్నికలు నిర్వహించండి'' అని వెంకన్న సవాల్ విసిరారు.
read more ఈఎస్ఐలో అవినీతిపై సీఎం జగన్ సీరియస్...ప్రధానికి లేఖ