Asianet News TeluguAsianet News Telugu

హరీశ్‌రావు, కేటీఆర్‌ వ్యాఖ్యలే జగన్‌ పనితీరుకు నిదర్శనం: బోండా ఉమ

టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతు ఉద్యమాన్ని చులకన చేస్తూ ఆ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

bonda uma fires on ysrcp leader and CM YS Jagan
Author
Vijayawada, First Published Dec 30, 2019, 8:20 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భూములిచ్చిన రైతులు తమ హక్కుల కోసం న్యాయపరంగా ఆందోళన చేస్తుంటే వారిని, వారి త్యాగాలను చులకన చేస్తూ మాట్లాడటం ఏమాత్రం తగదని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమామహేశ్వరరావు వైసిపి నాయకులపై మండిపడ్డారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులనే గౌరవం లేకుండా పెయిడ్‌ ఆర్టిస్ట్‌లని సంబోధించడం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు,  ఆపార్టీ అనుబంధ మీడియాసంస్థలకు తగదని అన్నారు. 

సోమవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ డబ్బుపిచ్చికోసం, విశాఖలో తనకు, తన అనుచరులకు ఉన్న భూముల విలువ పెంచుకోవడం కోసమే ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ పేరుతో అమరావతి ప్రజల బతుకుల్ని రోడ్డున పడేశారని ఆరోపించారు. 13రోజులుగా రాజధానిలోని 29గ్రామాల వారంతా తమ ఆందోళనలు వ్యక్తం చేస్తుంటే  ప్రభుత్వం వారిని కించపరిచేలా, భూములిచ్చినవారి త్యాగాలను అపహాస్యం చేసేలా  విష ప్రచారం చేయడం వ్యక్తులకు, సంస్థలకు మంచిది కాదన్నారు. 

తమను అపహాస్యం చేశారన్న బాధతో ఒక టీవీఛానల్‌ ప్రతినిధులను రైతులు ప్రశ్నిస్తే దానిపై 307కింద కేసులు పెట్టి అర్థరాత్రివేళ రైతుల్ని అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. రైతులపై హత్యాయత్నం కేసు ఎలా పెడతారని ప్రశ్నించడంతో ఆ కేసు తీసేసి,  వారిపై దొంగతనం కేసుమోపారని ఆరోపించారు. 5కోట్లమంది కలల రాజధానికోసం భూములిచ్చిన రైతులు వైసీపీ ప్రభుత్వానికి దొంగలు, హంతకుల్లా కనిపిస్తున్నారా అని బొండా ప్రశ్నించారు. 

read more  సుజనాకు జివిఎల్ షాక్...ఏపి రాజధానిపై కీలక వ్యాఖ్యలు

విలేకరులపై దాడిజరిగితే చంద్రబాబు స్పందించలేదంటున్న మంత్రి పూర్వాపరాలు తెలుసుకుంటే మంచిదన్నారు.   వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మహిళా ఎంపీడీవో ఇంటికెళ్లి అర్థరాత్రి వేళ చంపేస్తానని బెదిరిస్తే ఆయనపై ఒకచిన్న పెట్టీ కేసు పెట్టి పావుగంటలో బెయిలిచ్చి ఇంటికి పంపించారని, అదే ఎమ్మెల్యే ఒక పత్రికా సంపాదకుడిని చంపుతానని బెదిరిస్తే సదరు సంపాదకుడు భయంతో కొన్నాళ్లపాటు ఎవరికీ తెలియకుండా తలదాచుకున్నాడని బొండా తెలిపారు. 

తునిలో సత్యనారాయణ అనే విలేకరి హత్యకు ఎవరు కారణమో మంత్రి తెలుసుకోవాలన్నారు. ఏడు నెలల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని విలేకరులపై దాడులు, హత్యలు చేయించిన వైనాన్ని రాష్ట్ర  ప్రజలెవరూ మర్చిపోలేదన్నా రు. మహిళా అధికారిని బెదిరించిన ఎమ్మెల్యేపై చిన్నకేసు పెట్టడం.. రాజధాని రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టడమేనా జగన్‌ పరిపాలన అని ఉమా నిలదీశారు.  

సీనియర్‌ పాత్రికేయులు శేఖర్‌గుప్తా, పక్కరాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌ వ్యాఖ్యలే జగన్‌ పనితీరుకు, పాలనకు నిదర్శనమనే విషయాన్ని మంత్రులు అర్థంచేసుకోవాలన్నా రు. వైసీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ పంట పండుతుందన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు అక్షరసత్యాలయ్యాయన్నారు. వైసీపీ పుణ్యమా అని పక్కరాష్ట్రంలో సంబరాలు చేసుకుంటుంటే రాజధానిలోని రైతులేమో తమ ఇళ్లలో తాము నివసించడానికి కూడా గుర్తింపుకార్డులు చూపాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. 

ఒకపథకం ప్రకారం అమరావతిని చంపేసిన రాష్ట్రప్రభుత్వం విశాఖలోని తమ భూములను అమ్ము కోవడానికి, తెలంగాణలోని రియల్‌ఎస్టేట్‌ రంగాన్ని బాగుచేయడానికి, జీఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌కమిటీ, హైపవర్‌ కమిటీలంటూ అన్నివ్యవస్థలను సర్వనాశనం చేసిందన్నారు. పత్రికరంగాన్ని, విలేకరులను గౌరవించే సంస్కృతి తెలుగుదేశానికి ఆదినుంచి ఉందని, టీడీపీ పాలనలో విలేకరులపై స్వేచ్ఛగా తమవిధులు నిర్వర్తించారన్నారు.

read more  మళ్లీ ఇసుక కొరత రాకుండా వుండాలంటే చేయాల్సిందిదే: సీఎం జగన్

రాజధాని కోసం ఏర్పాటుచేసిన జాయింట్‌యాక్షన్‌ కమిటీకి, అమరావతి పరిరక్షణ సమితికి టీడీపీ మద్ధతు ఉంటుందన్నారు. తమ అవినీతిని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రాష్ట్రప్రభుత్వం రూ.లక్షకోట్ల బూచిని చూపుతూ, అమరావతిని చంపేసిందన్నారు. 

గత 5ఏళ్లలో రూ.10వేలకోట్ల ఖర్చుతో అమరావతిని 60శాతానికిపైగా గత ప్రభుత్వం పూర్తిచేసిందని, మరో రూ.10వేలకోట్లు ఖర్చుపెడితే రాజధాని పూర్తవుతుందన్నారు.   స్వలాభం కోసం పనిచేయకుండా 13జిల్లాల అభివృద్ధిపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించాలని ఉమా ప్రభుత్వానికి హితవు పలికారు.

రాజధాని ఉద్యమాన్ని పలుచనచేయడానికే టీడీపీ ఎమ్మెల్యేకి ఎర...

రాజధాని సమస్యనుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికే గుంటూరు టీడీపీ ఎమ్మెల్యేకి ఎరవేశారని, రోడ్లపాలైన రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాన్ని నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వం ఈ కుటిల ఎత్తుగడకు పాల్పడిందన్నారు. నీచమైన కార్యక్రమాలు, దుర్మార్గమైన విధానాలతో రాష్ట్రసమస్యలను పక్కదారి పట్టించలేరన్నారు.     

సీఎం కార్యాలయం రాసిచ్చిన స్క్రిప్ట్‌నే టీడీపీ ఎమ్మెల్యే గిరి చదివారని... గుంటూరుజిల్లా లో జరుగుతున్న ఉద్యమాన్ని పలుచనచేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అధికార కాంక్ష తప్ప, ప్రజలసమస్యలు ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. రైతులపై పెట్టిన తప్పుడుకేసులను ఎత్తివేయాలని, తప్పుడువిధానాలు, బెదిరింపు రాజకీయాలు  మానుకోవాలని ఉమ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios