విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై బిజెపి పార్టీలో బిన్నస్వరాలు వినిపిస్తున్నారు. ఇప్పటికే రాజధాని మార్పు సాధ్యం కాదని అమరావతిలోనే కొనసాగుతుందని రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి పేర్కోనగా తాజాగా మరో ఎంపి జివిఎల్ ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడారు. 

రాష్ట్ర రాజధాని అంశం కేంద్రం  పరిధిలోని కాదని జివిఎల్ అన్నారు. కేంద్రం కల్పించుకుంటే వ్యవస్థకు లోబడి చేయాలన్నారు. ఒకవేళ రాష్ట్రం సహాయం కొరితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని అన్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా తాను బిజెపి అధికార ప్రతినిధిగా పార్టీ తరపున అసలు నిజాలు చెబుతున్నానని జివిఎల్ అన్నారు. సుజనా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని... వాటితో పార్టీకి ఏమాత్రం సంబంధం లేవని తెలిపారు. రాజధాని ప్రాంత 

రైతులకు న్యాయం ఖచ్చితంగా జరగాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ పట్ల అమరావతి రైతులు అభిమానం చూపిస్తున్నందుకు జివిఎల్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సలహా కోరితే మాత్రం ఖచ్చితంగా‌ అందిస్తుందని అన్నారు. 

read more  మళ్లీ ఇసుక కొరత రాకుండా వుండాలంటే చేయాల్సిందిదే: సీఎం జగన్

పౌరసత్వ చట్ట సవరణ అనేది దేశ ప్రజలకి కాదని జివిఎల్ పేర్కొన్నారు. పౌరసత్వాన్ని కొందరికి ప్రసాదించే చట్టం పొరుగు దేశాల నుంచి వచ్చిన అల్ప సంఖ్యాకులకు మాత్రమేనని అన్నారు. 

పక్క దేశం పాక్ లో 22 శాతం ఉండాల్సిన అల్ప సంఖ్యాక శాతం 2 శాతానికి మాత్రమే పరిమితమవ్వడానికి కారణాలేంటని ప్రశ్నించారు.  ఈ విషయంలో పాక్ ను తప్పుపట్టాల్సిన  రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని  మండిపడ్డారు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ కనేరియాను తమ టీంలో గుర్తించేవాళ్ళం కాదని స్వయంగా చెప్పాడని అన్నారు.

 హిందూ, సిక్కులకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇవ్వాలని గతంలో ప్రకాష్ కారత్ కొరలేదా అని గుర్తుచేశారు. సిఎఎ పట్ల ప్రజల్లో అపోహ తొలగిపోతుందని కొత్త నాటకాలు ఆడుతున్నారని... ముస్లింలతో పాటు ఎవ్వరినైనా బారతీయులుగానే చూస్తున్నామన్నారు.  

కాంగ్రెస్ నేతలకు ఎన్‌పిఆర్ అంటే ఏమిటో కూడా తెలియదని ఎద్దువా  చేశారు. 2009లో కాంగ్రెస్ కు మద్ధతిచ్చిన ఓవైసి ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ చేస్తే లౌకికవాదం బిజెపి చేస్తే మత విధ్వేషాలు రెచ్చగొట్టడమా  అని ప్రశ్నించారు.

read more  రాయలసీమ రాజధాని అవసరమే లేదు... కావాల్సిందిదే: మంత్రి పెద్దిరెడ్డి

జనవరి 4న జెపి నడ్డా కడప సిఎఎ పై నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారని అన్నారు. సిఎఎ, ఎన్‌సిఆర్ పై రాజకీయ పార్టీల వైఖరిని పది లక్షల బిజెపి కార్యకర్తలతో ప్రజలకే వివరించి వారిలో అపోహలను తొలగిస్తామన్నారు.