ఎట్టి పరిస్థితుల్లో అది జరిగితీరాలి: అధికారులకు సీఎం ఆదేశం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సంవత్సరాది ఉగాది రోజున అర్హత కలిగిన నిరుపేదలకు ఇళ్ళ స్ధలాల పట్టాలను అందించనుంది. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లపై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు.

AP CM  YS Jagan review meeting on distributing house site pattas

అమరావతి: ఉగాదిరోజున అర్హులైన పేదలందరికి ఇళ్లపట్టాలను అందించి తీరాలన్న కృతనిశ్చయంతో ఏపి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్ల గురించి తెలుసుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.

నిరుపేదలకు ఇళ్లపట్టాలను అందించడం కోసం భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లాల వారీగా ఉన్నతాధికారులు పర్యటించి సమీక్ష చేయాలన్నారు. కింది స్థాయిలో అధికారులులక్ష్యాలను చేరుకున్నారా? లేదా? అన్నదానిపై సమగ్ర వివరాలు సేకరించాలని సూచించారు.  ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు సీఎం సూచించారు. 

ప్రతి జిల్లాలో కనీసం రెండుసార్లు సమీక్షలు చేయాలన్నారు. ప్లాట్ల మార్కింగ్‌ జరుగుతుందా? లేదా? ఇళ్లపట్టాలకోసం గుర్తించిన భూములను సిద్ధం చేస్తున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలన్నారు. 

read more  జర్నలిస్టుల కంటే కాకులే నయం... క్రూర జంతువు మాదిరిగా: పేర్ని నాని

ఉగాది నాటికి ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమం సాఫీగా సాగడానికి అవసరమైతే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్నితో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఇళ్ల పట్టాల పంపిణీపై ఇటీవల ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా పలుమార్లు చర్చించింది. ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాకు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే స్థలాలు కొనే అంశంపైనే చర్చిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ఆర్‌టీజీఎస్‌ నుంచి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన జాబితాను ప్రతి జిల్లాకు పంపించామని బోస్ వెల్లడించారు. ఇన్‌కంట్యాక్స్ కడుతున్నవారు, కరెంట్ బిల్లు చెల్లిస్తున్న వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాల్సిందిగా సీఎం ఆదేశించినట్లుగా పేర్కొన్నారు.

read more  క్రైమ్ రౌండప్ 2019... విజయవాడలో పెరిగిన హత్యలు

కాగా గతంలో అర్బన్ హౌసింగ్ నిర్మాణంలో మొత్తం దోపిడి చేశారని.. వెయ్యి రూపాయలు దాటని వ్యయాన్ని 2 వేలకు పైగా పెంచేసి అవినీతికి పాల్పడ్డారని సీఎం జగన్ రివ్యూలో తేలింది. పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios