టిడిపిలో నూతనోత్తేజం... చంద్రబాబు సమక్షంలో భారీ చేరికలు

తెలుగుదేశం పార్టీలో శుక్రవారం నూతనోత్తేజం కనిపించింది. చాలాకాలం తర్వాత ఆ పార్టీలోకి కొందరు రాష్ట్రస్థాయి బిసి నేతలు చేరారు. చంద్రబాబు సమక్షంలో వారంతా టిడిపి కండువాా కప్పుకున్నారు.  

ap bc community leaders joined tdp  in presence og chandrababu naidu

అమరావతి: తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా బీసిలు ఉంటారనే అక్కసుతోనే వైసిపి ప్రభుత్వం వారిపై కక్ష సాధిస్తోందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అయితే బిసిలకు టిడిపి పార్టీ అండదండలు ఎప్పుడూ వుంటాయని... వారిని కాపాడుకోడానికి వైసిపి ప్రభుత్వంతో పోరాడతానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

ఆంధ్ర ప్రదేశ్ బీసి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్ తో సహా 13జిల్లాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఆయా జిల్లాలనుంచి సమితి నేతలు, మహిళలు పెద్దఎత్తున చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. వారందరికీ పసుపు కండువాలు కప్పి చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుత.... ఇసుక కొరతతో పనులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న 60మందిలో 80% బీసిలేనని ఆవేదన చెందారు. వడ్డెరలు, వడ్రంగులు, చేతివృత్తుల వారి జీవనోపాధిని ఈ ప్రభుత్వం దెబ్బతీసిందరని ధ్వజమెత్తారు. 

టిడిపి గత ఐదేళ్ల పాలనలో రూ.43వేల కోట్ల బడ్డెట్ బీసిలకు కేటాయించి వారి సంక్షేమానికి వినూత్న పథకాలను తెచ్చిందన్నారు. ప్రత్యేక సబ్ ప్లాన్ బీసిలకు ప్రారంభించిన ఘనత టిడిపిదేనని అన్నారు. 21బిసి ఫెడరేషన్లను ఏర్పాటు చేసినట్లు... రూ.2వేల కోట్ల విలువైన ఆదరణ పరికరాలను ఎనిమిది లక్షల మందికి 90% సబ్సిడిపై అందించినట్లు గుర్తుచేశారు.

read more  అమరావతిపై చంద్రబాబు ఆలోచన అది... జగన్ ది మాత్రం...: అనురాధ

ఇక విద్యార్థుల కోసం విదేశీ విద్యకు సాయాన్ని రూ.15లక్షలకు పెంచామని... రూ.3వేల కోట్లు ఉపకార వేతనాలు ఇచ్చామన్నారు. అలాగే చేనేతలకు రూ. 111కోట్ల రుణాల మాఫీ చేశామని... రూ.200కోట్ల బడ్జెట్ ఎంబిసిలకు పెట్టామని... ప్రత్యేక కార్పోరేషన్ కూడా ఏర్పాటు చేశామన్నారు. 

150యూనిట్ల ఉచిత విద్యుత్ నాయీ బ్రాహ్మణులు, రజకులకు అందించినట్లు తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో పరిహారం రెట్టింపు చేశామని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పోస్ట్ తో సహా ఎనిమిది కీలక మంత్రిత్వ శాఖలు బీసిలకే ఇవ్వడమే కాదు ఏపిఐఐసి, టిటిడి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్లుగా, 9మంది వైస్ ఛాన్సలర్లుగా బీసిలను నియమించినట్లు గుర్తుచేశారు. 

ap bc community leaders joined tdp  in presence og chandrababu naidu

అయితే ఇప్పుడు ఈ పదవులన్నీ అగ్రకులాలవారికే కట్టబెట్టారని విమర్శించారు. రూ35వేల చొప్పున 35వేల బీసి కుటుంబాలకు పెళ్లికానుకగా అందించిన విషయం ప్రస్తావిస్తూ ప్రస్తుతం వాటన్నింటిని రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. బీసిలను నిర్లక్ష్యం చేస్తే అదే వైసిపి ప్రభుత్వ పాలనకు చరమగీతం అవుతుందని విమర్శించారు.

video news: జోరుపెంచిన టిడిపి... చంద్రబాబు సమక్షంలో భారీ చేరికలు

ఈ సందర్భంగా బిసి పోరాట సమితి నాయకులు చంద్రబాబుకు జ్యోతిరావు పూలె ఫైబర్ విగ్రహాన్ని బహుకరించారు. టిడిపిలో చేరినవారిలో సమితి 13జిల్లాల అధ్యక్షులు నూకరాజు, ఆరాధ్యుల వెంకటరమణ, రాజా, కార్తీక్, విజయ్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రావణి తదితరులు ఉన్నారు. ఆయా జిల్లాలలో బిసిల సమస్యలపై పోరాడాలని, టిడిపి బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి విజ్ఞప్తి చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios