Asianet News TeluguAsianet News Telugu

sand: ఆన్‌లైన్ ఇసుక కొనడం ఎలా .. ప్రజలకు కలెక్టర్ సూచన

ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకునే విధానం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ ఆదివారం వ్యాఖ్యనించారు. 

Andhra Pradesh sand crisis..how book the sand in online
Author
Vijayawada, First Published Nov 10, 2019, 3:20 PM IST

విజయవాడ : ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకునే విధానం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ ఆదివారం వ్యాఖ్యనించారు. దీనికి పరిష్కారంగా కాల్ సెంటర్‌ ఏర్పాటు చేశామని 0866 2474801, 803, 804 నంర్లకు ఫోన్‌ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఏపీఎండీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక విక్రయిస్తుండగా ప్రస్తుతం 18200 టన్నుల ఇసుక నిల్వ ఉందని కలెక్టర్‌ వెల్లడించారు. 

ఏపీలో ఉల్లి అక్రమ నిల్వలు: ట్రేడర్లపై కేసులు

మొత్తంగా ఐదు రీచ్‌లు ఇప్పుడు నిర్వహణలో ఉన్నాయని, 38 మంది పట్టా ల్యాండ్‌ ఓనర్లు తవ్వకాలకు తమ సుముఖత వ్యక్తం చేశారని తెలపారు. మరోవైపు శనివారం జిల్లాలోని అన్ని రెవెన్యూ కేంద్రాలలో రైతు భరోసా కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. 

ఇదిలా ఉండగా, సోమవారం మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జన్మదినం సందర్భంగా ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో మైనార్టీల సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. 

జగన్ సొంత జిల్లాలో దారుణం

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఉర్దూలో పాండిత్యం ఉన్న నలుగురికి జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తామని తెలిపారు. అబుల్‌ కలాం ఆజాద్‌ పేరున జాతీయ పురస్కారం, అబ్దుల్‌ కలాం పేరుతో విద్యా పురస్కారం అందజేస్తామని వివరించారు. మంత్రులు, ఉన్నతాధాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదివారం ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios