video: జగన్ సొంత జిల్లాలో దారుణం: ఎమ్మార్వో కార్యాలయంలోనే అన్నదాత ఆత్మహత్యాయత్నం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో దారుణం  చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ ఘటనను మరువక ముందే ఓ రైతు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

farmer suicide attempt at kadapa district kondapuram mro office

కడప: హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ ఘటనను మరువక ముందే మరో భూసమస్య ఘటన వెలుగులోకి వచ్చింది. తహశీల్దార్ విజయా రెడ్డి హత్యాఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కలకలం సృష్టిస్తుండగానే మరో తెలుగు రాష్ట్రంలోని కడప జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కొండాపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది.

కొండాపురం మండలంలోని ముంపు గ్రామమైన దత్తాపురంకు చెందిన రైతు ఆదినారాయణ ఎమ్మార్వో కార్యాలయంలో పనికోసం వచ్చాడు.  తన తల్లి పేరు మీద ఉన్న డికెటి భూమిని తన పేరిట మార్చి నష్టపరిహారం చెల్లించాలని ఆయన గత ఏడాదికాలంగా తహశీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ(మంగళవారం) కూడా కార్యాలయానికి వచ్చాడు. 

"

అయితే ఎప్పటిలాగే ఇవాళ కూడా పని కాకపోడంతో  తీవ్ర మనస్ధాపానికి గురయిన రైతన్న ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగానే అందరూ చూస్తుండగానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడున్నవారు అతడి ప్రయత్నాన్ని అడ్డుకోవడం  పెను ప్రమాదం తప్పింది.  

tahsildar Vijaya Reddy: నిందితుడు సురేష్ పరిస్థితి ఆందోళనకరం

దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాధిత రైతు మాట్లాడుతూ.. సంవత్సరం కాలంగా తన సమస్యపై అధికారులను వేడుకుంటున్నా  పెడ చెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో  తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు.   

సోమవారం నాడు అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.మంటల్లో చిక్కుకొన్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ఘటనలో గురునాథానికి 80 శాతం గాయాలయ్యి అతడు కూడా ఇవాళ మరణించాడు.

farmer suicide attempt at kadapa district kondapuram mro office

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.

read more  vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్య....బయటపడుతున్న షాకింగ్ నిజాలు

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు  విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య ప్రయత్నించారు. డ్రైవర్ గురునాథం 80 శాతం కాలిపోయాడు. చంద్రయ్య 60 శాతం కాలిపోయాడు.

సూర్యాపేట జిల్లాకు చెందిన గురునాథం సుమారు ఆరు ఏళ్లుగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డిని తన సోదరిగా గురునాథం భావించాడు. దీంతో ఆమె గురునాథాన్నే తన డ్రైవర్ గా కొనసాగించింది. డ్రైవర్ గురునాథం విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. గురునాథం కుటుంబం చాలా పేద కుటుంబం. విజయారెడ్డి కుటుంబంలో సభ్యుడిగా గురునాథం ఉండేవాడని ఆ కుటుంబానికి చెందిన వాళ్లు చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios