హైదరాబాద్: మార్కెట్‌లో ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరగడంతో ఉల్లి వ్యాపారులు ఉల్లిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని 70 ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు ఏక కాలంలోసోదాలు నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల అక్రమంగా ఉల్లిపాయ నిల్వలు ఉన్నట్టుగా పోలీసులు విజిలెన్స్  అధికారులు గుర్తించారు. 27 లక్షల విలువైన 603 క్వింటాళ్ల ఉల్లిపాయ నిల్వలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

Also Read: తల పగులగొడుతారా: పోలీసులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

అంతేకాదు అక్రమంగా ఉల్లిపాయ నిల్వలను ఉంచిన 37 మంది ట్రేడర్స్‌కు జరిమానాలు విధించారు. అంతేకాదు  వారికి నోటీసులు కూడ జారీ చేశారు. అక్రమంగా ఉల్లిపాయలను ఎందుకు నిల్వ చేశారనే విషయమై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

అక్రమంగా ఉల్లిపాయలను నిల్వ ఉంచిన 10 మంది ట్రేడర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఒక్క హోల్‌సేల్ వ్యాపారుల వద్ద 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్ల వద్ద 10 మెట్రిక్ టన్నుల ఉల్లి నిల్వలు మాత్రమే ఉండాలి. 

Read Also: జగన్ ప్రభుత్వానికి షాక్: రిలయన్స్ ఫ్లాంట్ వెనక్కి.

కానీ, నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా ఉల్లిని నిల్వ ఉంచిన  వారిపై విజిలెన్స్ అధికారులు కేసులు  నమోదు చేశారు.మార్కెట్లో ఉల్లిపాయ కృత్రిమ కొరతను సృష్టించి ధరలను  విపరీతంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని విజిలెన్స్ అధికారులు చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఉల్లి నిల్వలు తగ్గిపోయాయి. మహారాష్ట్రలో వరదల కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. ఏపీ రాష్ట్రంలోని కర్నూల్ మార్కెట్ కు వచ్చిన ఉల్లి కూడ ఎక్కువ కాలం నిల్వ ఉండడం లేదని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. 

మరో వైపు దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది. దీంతో ఉల్లి ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. 

అయితే మహారాష్ట్రలో పంట చేతికి వచ్చే సమయంలో  వరదలు ఉల్లి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో మళ్లీ ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ఉల్లి ధరలు పెరగడంతో వినియోగదరారుల నుండి సొమ్ము చేసుకొనేందుకు ట్రేడర్లు పన్నుతున్న పన్నాగాన్ని విజిలెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. అక్రమంగా ఉల్లిని నిల్వ చేసిన ట్రేడర్లపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు.

మరికొందరు ట్రేడర్లపై నోటీసులు జారీ చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్దంగా ఉల్లిని నిల్వ ఉంచకూడదని విజిలెన్స్ అధికారులను హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాడులు కొనసాగుతాయని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉల్లిని వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకొంటున్నట్టుగా విజిలెన్స్ ఉన్నతాధికారులు ప్రకటించారు.