Asianet News TeluguAsianet News Telugu

వెంకటపురంలో శాశ్వత ఆరోగ్య కేంద్రం.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. అవంతి

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ వెంకటపురం ప్రైమరీ స్కూల్ లో తాత్కాలిక ఆస్పత్రిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. 

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ వెంకటపురం ప్రైమరీ స్కూల్ లో తాత్కాలిక ఆస్పత్రిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ,వెంకటాపురంలో జరిగిన దుర్ఘటన మర్చిపోలేనిది, పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేం.. కానీ ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటాం. జరిగిన ఘటన నుంచి ఈ గ్రామాలు కోలుకున్నాయి. సుమారు 20 వేల మందికి 10వేల చొపున్న అందించాం. కొందరికి హాస్పిటల్ బిల్, చెక్ లు అందాల్సివుందని దృష్టి కి వచ్చింది.. ఆర్డీవో నేతృత్వంలో వాటిని పరిష్కరిస్తాం. ఇక్కడ గ్రామస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. శాశ్వత ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తునాం. ఈ ఘటన పై వేసిన హైపవర్ కమిటీ నిన్న నే రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడి గ్రామస్తుల ఆరోగ్య విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేఘాద్రి గడ్డ నీటి పరిశీలన జరిగింది, తిరిగి మళ్ళీ ప్రజలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.