విశాఖలో పుట్టినరోజు వేడుకలో రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్
పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది.
పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది. గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం సీతానగరం ఆర్‌హెచ్ కాలనీలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో రౌడీషీటర్ మొల్లి సంతోష్ పాల్గొన్నాడు. అదే వేడుకలకి వచ్చిన వడ్లపూడికి చెందిన రౌడీ షీటర్ గందవరపు తరుణ్ తో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. వీరి మధ్య పాత గొడవలు కూడా ఉండటంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఒకరిప్తె ఒకరు దాడులకు దిగారు. ఈ సంఘటనలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.