Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ పర్యటన వేళ... జగిత్యాలలో టీఆర్ఎస్ ప్లెక్సీకి నిప్పంటించిన యువకుడు

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జగిత్యాల పట్టణం టీఆర్ఎస్ ప్లెక్సీలు, హోర్డింగ్, జెండాలతో నిండిపోయింది.

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జగిత్యాల పట్టణం టీఆర్ఎస్ ప్లెక్సీలు, హోర్డింగ్, జెండాలతో నిండిపోయింది. ఇలా ముఖ్యమంత్రికి స్వాగతం పలికే క్రమంలో కొందరు టీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ జాతిపితగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అడ్డంగా భారీ ప్లెక్సీ ఏర్పాటుచేసారు. దీంతో ఆగ్రహించిన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఓ యువకుడు ఆ ప్లెక్సీపై పెట్రోల్ పోసి దగ్దం చేసాడు.  

జగిత్యాల సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జగిత్యాల లోని అంగడి బజార్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎదుట విగ్రహం కనబడకుండా నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పద్మశాలి కులస్తుడు ఫ్లెక్సీని దగ్ధం చేశాడు.