ప్రాణాలు తీసిన ఈత సరదా... గోదావరిలో మునిగి ఇద్దరు బాలురు దుర్మరణం

భద్రాచలం : శివరాత్రి పండగవేళ భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు నీటమునిగి మృతిచెందారు.

Share this Video

భద్రాచలం : శివరాత్రి పండగవేళ భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు నీటమునిగి మృతిచెందారు. దీంతో గోదావరి తీరంలో మృతుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. భద్రాచలం పట్టణానికి చెందిన ఆరుగురు బాలురు ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో సరదాగా ఈతకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు బాగా లోతులోకి వెళ్లడంతో నీటమునగగా మిగతా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో గోదావరి నదిలోకి దిగి పోలీసులే గాలింపు చేపట్టారు. ఇద్దరు బాలుర మృతదేహాలను వెలికితీయడంతో బాధిత కుటుంబాలు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video