పిచ్చికుక్క కరిచినట్లు మాట్లాడే బండికి ఎర్రగడ్డే దిక్కు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ ధ్వజం
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ క్షద్రపూజలు చేస్తున్నారంటూ తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘాటుగా స్పందించారు.
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ క్షద్రపూజలు చేస్తున్నారంటూ తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘాటుగా స్పందించారు. బాధ్యతాయుత ఎంపీ పదవిలో వుండి ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గనిపించడం లేదా? అంటూ నిలదీసారు. పిచ్చి లేచినట్లు ఇలాంటి బట్టేబాజ్ మాటలు ఇంకెంతకాలం అంటూ మండిపడ్డారు. పిచ్చికుక్క కరిచినట్లుగా ప్రవర్తిస్తున్న సంజయ్ కు ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేయాలన్నారు. ఆయన మెదడు తలలో కాకుండా మోకాళ్ళకిందికు జారినట్టుందన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని... లేదంటే ప్రజలే చెంప పగలగొడతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ హెచ్చరించారు.