సాండ్ మాఫియా వెనకున్నది కేసీఆర్ కుటుంబమే... మానేరు తీరంలో రేవంత్ కామెంట్స్

కరీంనగర్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు.

First Published Mar 1, 2023, 5:10 PM IST | Last Updated Mar 1, 2023, 5:10 PM IST

కరీంనగర్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరు వాగులో జరుగుతున్న ఇసుక తవ్వకాలను ఆయన పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని... ఈ విషయాన్ని ప్రజలకు చూపించేందుకే తాను ఇక్కడికి వచ్చానని రేవంత్ అన్నారు. కేసిఆర్ కుటుంబసభ్యుల అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని...  లారీలను అడ్డుకున్నా, ఫిర్యాదులు చేసినా దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. నెరేళ్ళలో ఇసుక మాఫియాను అడ్డుకున్న రైతులను డ్రామారావు పోలీసులతో ఎలా చిత్రహింసలు పెట్టారో చూసామని అన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు జోగినిపల్లి సంతోష్, రవీందర్ రావు ఇసుక మాఫియా వెనక వున్నారని రేవంత్ ఆరోపించారు. మానేరు వాగులో  ఇలాగే ఇసుక దోపిడీ జరిగితే మరికొన్నేళ్లలో ఇది ఎడారిగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసారు. 

అంతకుముందు బిజిగిర్ షరీఫ్ దర్గాను రేవంత్ సందర్శించారు. కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు, దర్గా ప్రతినిధులతో కలిసి రేవంత్ ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అనంతరం ఓ హిందూ దేవాలయంలో కూడా రేవంత్ పూజలు చేసారు.