అలా చేస్తే ప్రజలే కాదు, నేతలూ చస్తారు: హీరో రాజశేఖర్ (వీడియో)

సినీ పరిశ్రమలో ఉన్న తనకు స్టెత్ వేసుకోవడానికి బ్రిడ్జి కోర్సు ఇస్తారా అని తెలుగు సినీ హీరో రాజశేఖర్ ప్రశ్నించారు. తాను మోడీ గురించి మాట్లాడడానికి రాలేదని, కానీ విషయం మోడీకి తెలిసేలా చేయాలని వచ్చానని ఆయన అన్నారు. ధర్నా చౌక్ వద్ద ఆయన ప్రసంగించారు.  

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎన్ఎంసి బిల్లు ఆమోదానికి ముందు కౌన్సిల్ డాక్టర్లను పెట్టాలని ఆయన కోరారు. మోడీ మంచి కోసమే చేయవచ్చునని, కానీ బ్రిడ్జి కోర్సు ఎలా పెడుతారని ఆయన అన్నారు. తాను ఎంబిబీఎస్ చేశానని, ఆరు నెలలు బ్రిడ్జి కోర్సు చేసి డెంటల్ డాక్టర్ కావచ్చునా అని అన్నారు. కమ్యూనిటీ సర్వీస్ చేసేవాళ్లకు, ఆర్ఎంపీలకు బ్రిడ్జి కోర్సు పెడితే ఎలా అని అడిగారు. 

ఇప్పటికే డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని, బ్రిడ్జి కోర్స్ చేస్తే అందరూ తన్నులు తినాల్సి వస్తుందని రాజశేఖర్ అన్నారు. ఎవరి కోర్సులు వాళ్లకే ఉండాలని, ఇలా తొందరపడి చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలువలేరని, పిచ్చిగా ఓడిపోతారని అన్నారు. తదుపరి పరీక్ష ఏ లెక్కన పెడుతారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని ఆయన అన్నారు. ఎవరిని పడితే వాళ్లను డాక్టర్లను చేస్తే ప్రజలూ నాయకులూ అందరూ చస్తారని రాజశేఖర్ అన్నారు.

Related Video