Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో సందడి చేసిన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్

Sep 23, 2021, 5:17 PM IST


జగిత్యాలలో హీరోయిన్ అను ఇమ్మాన్యు యెల్ సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఎల్విఆర్ షాపింగ్ మాల్ ను ఆమె ప్రారంభించారు. హీరోయిన్ అనును చూసేందుకు జగిత్యాల పట్టణప్రజలు భారీగా షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్త,
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. 

జగిత్యాల పట్టణానికి బ్రాండెడ్ ఎల్విఆర్ షాపింగ్ మాల్ రావడం స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా వుంటుందని... అన్ని రకాల దుస్తులు ఇందులోనే అందుబాటులో వుంటాయన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంత గొప్ప షాపింగ్ మాల్ ఏర్పాటుతో 250 మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. నిర్వాహకులు ఎల్వీఆర్ శివప్రసాద్, ఆయన మిత్రులకు మంత్రి కొప్పుల శుభాకాంక్షలు తెలిపారు.

Video Top Stories