Asianet News TeluguAsianet News Telugu

దుమ్ములేపిన సీఎం ఎంట్రీ... జగిత్యాలలో ల్యాండయిన కేసీఆర్

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి జగిత్యాలకు చేరుకున్నారు. 

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి జగిత్యాలకు చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడినుండి ప్రత్యేక బస్సులో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి బయలుదేరారు కేసీఆర్. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత వరుసగా మెడికల్ కాలేజ్, కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిని ముగించుకుని బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లనున్నారు. ఇప్పటికే జగిత్యాల సమీపంలోని మోతె గ్రామంలో బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేసి భారీ సమీకరణ చేపట్టారు. 

Video Top Stories