డిజిపి మహేదర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బంపరాఫర్... రిటైర్మెంట్ తర్వాత పదవి ఖాయం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 

Share this Video

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది చివర్లో (డిసెంబర్) డిజిపిగా పదవీ విరమణ పొందినా మహేందర్ రెడ్డి సేవలను మరోవిధంగా వాడుకుంటామని... ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. డ్రెస్ మారితే ఆయన డ్రెస్ మారవచ్చే కానీ సేవ చేయడం మారదని... ఏదో రూపంలో ఆయనను వినియోగించుకుంటామని అన్నారు. హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రిటైర్మెంట్ తర్వాత మహేందర్ రెడ్డి సేవలను ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీని చేసినట్లుగానా వాడుకుంటారా లేక ఐపిఎస్ అధికారి ఏకే ఖాన్ మాదిరిగా ఏదయినా కార్పోరేషన్ అప్పగిస్తారా అన్నదానిపై రాజకీయ చర్చ సాగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video