
సొంత కారులో క్షతగాత్రులను హాస్పిటల్ కు... మానవత్వం చాటుకున్న బండి సంజయ్
హైదరాబాద్ : రాజకీయాల కంటే మానవత్వమే గొప్పదని చాటిచెప్పారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.
హైదరాబాద్ : రాజకీయాల కంటే మానవత్వమే గొప్పదని చాటిచెప్పారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. తన రాజకీయ వ్యవహారాలను పక్కనపెట్టి మరీ ప్రమాదానికి గురయి రోడ్డుపై గాయాలతో పడివున్న క్షతగాత్రులకు సాయం అందించారు సంజయ్. నిన్న(ఆదివారం) హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఓ బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. ఇదే సమయంలో బండి సంజయ్ అదే మార్గంలో వెళుతూ గాయాలతో రోడ్డుపై పడివున్న క్షతగాత్రులను చూసి చలించిపోయారు. దీంతో తన బిజీ షెడ్యూల్ ను పక్కనపెట్టిన సంజయ్ వారికి సాయం చేసారు. వెంటనే తన కాన్వాయ్ నిలిపి క్షతగాత్రుల పరిస్థితి తెలుసుకున్న సంజయ్ వారికి వెంటనే వైద్యం అవసరమని భావించారు. తన కారులో వారిని హాస్పిటల్ కు తరలించి సరయిన సమయంలో చికిత్స అందేలా చూసారు. ఇలా ఎవరు ఎటుపోతే తనకేంటి అనుకోకుండా తోటి మనుషులకు సాయం చేసి సంజయ్ గొప్పమనసును చాటుకున్నారు.