Asianet News TeluguAsianet News Telugu

ఏరా బడుద్దాయి... ఎన్టీఆర్ పేరు తీసేస్తావారా లఫంగి..: కొడాలి నానిపై దేవినేని ఉమ ఫైర్

గుడివాడ : ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించాడంటూ అరెస్ట్ చేసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావుకు గుడివాడ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

గుడివాడ : ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించాడంటూ అరెస్ట్ చేసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావుకు గుడివాడ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు నుండి తన ఇంటి వరకు అనుచరులు, టిడిపి శ్రేణులతో రావి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, టిడిపి నేత వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. మహిళలు రావికి మంగళహారతులు పడుతూ స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. పేదల ఇళ్లను కూల్చేస్తుంటే వారికి అండగా నిలవడమే రావి చేసిన తప్పా... ప్రజల ప్రక్షాన నిలబడితే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇల్లు కోల్పోయిన దళిత మహిళలకు సమాధానం చెప్పు నాని అంటూ నిలదీసారు, మంత్రి పదవి కోల్పోయిన బడుద్దాయి కొడాలి నాని తీసేసిన తహసీల్దార్ తో సమానం... 
జగన్ రెడ్డి బూట్లు నాకుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రోడ్లు వేయడం చేతకాని దద్దమ్మ కొడాలి నాని... ఈయనా ఒక ఎమ్మెల్యేనా అంటూ ఎద్దేవా చేసారు. ఎన్టీఆర్, హరికృష్ణ పేరు చెప్పే అర్హత నానికి లేదని ఉమ అన్నారు.