Asianet News TeluguAsianet News Telugu

దుబ్బాక ఉప ఎన్నిక: పోలీసులు విడుదల చేసిన వీడియో ఇదే...

సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం జరిగిన సోదాలకు సంబంధించిన వీడియోను పోలీసులు మంగళవారం విడుదల చేశారు. 

సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం జరిగిన సోదాలకు సంబంధించిన వీడియోను పోలీసులు మంగళవారం విడుదల చేశారు. అంజన్ రావు నివాసంలో డబ్బుుల స్వాధీనం చేసుకున్న సంఘటన మాత్రమే కాకుండా పోలీసులు అంజన్ రావు భార్యను ప్రశ్చించిన విషయం, ఆమె చెప్పిన విషయం ఆ వీడియోలో రికార్డయింది. 

దుబ్బాక నోట్ల కట్టల వివాదం మరింతగా ముదురుతోంది. ఆ డబ్బుుల తమవేనని అంజన్ రావు భార్య అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 
తమకు ఏ విధమైన వ్యాపారాలు లేవని, తన భర్త అంజన్ రావు ఆ డబ్బులు తెచ్చారని ఆమె చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం జరిపిన సోదాల్లో పోలీసులు దాదాదుపు 12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 

తన భర్త ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో తనకు తెలియదని ఆమె చెప్పారు. తన భర్త డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు, ఏం చేస్తాడనే విషయాన్ని తను పట్టించుకోనని అంజన్ రావు భార్య చెప్పారు. 

సోదాల విషయం తీవ్ర వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. తాము స్వాధీనం చేసుకున్న నగదును బిజెపి కార్యకర్తలు లాక్కెళ్లారని సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ చెప్పారు. అయితే, పోలీసులే డబ్బులు పెట్టి స్వాధీనం చేసుకున్నట్లు నాటకమాడారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ సంఘటన నేపథ్యంలో సిద్ధిపేటకు వచ్చిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేసి కరీంనగర్ కు పంపించారు. కరీంనగర్ బిజెపి కార్యాలయంలో బండి సంజయ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లి దీక్ష కొనసాగిస్తున్నారు.