షట్టర్ పగలగొట్టి... ఊటూరు ఎస్‌బిఐ బ్యాంక్ లో చోరీకి యత్నం
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్ ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడి చోరీకి యత్నించారు దోపిడీదొంగలు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్ ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడి చోరీకి యత్నించారు దోపిడీదొంగలు. బ్యాంక్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలకు చొరబడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆరా తీస్తున్నారు. సీపీ కమలాసన్ రెడ్డి కూడా బ్యాంకును పరిశీలించారు. డాగ్ స్కాడ్ తో చోరీకి యత్నించిన ముఠా గురించి తెలీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.పింగర్ ప్రింట్ ను పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లో డబ్బులు చోరీకి గురి కాలేదని తెలిపారు.చోరీకి సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులతో చర్చించారు సిపి.