Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు.. హైదరాబాదులో నో

May 19, 2020, 11:00 AM IST

తెలంగాణలో దాదాపు రెండు నెలల తరువాత ఈ రోజునుండి ఆర్టీసీ  బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో బస్సులు రోడ్లెక్కాయి.  సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు రోడ్ల మీదకు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో మినహా రాష్ట్రమంతటా బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌కు నల్గొండ వైపు నుంచి వచ్చే బస్సుల్ని ఎల్బీనగర్ వరకు, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సుల్ని ఆరాంఘర్ వరకు, వరంగల్ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల్ వరకు అనుమతిస్తారు. నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకు వస్తాయి.

Video Top Stories