Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ లో సత్యవతి రాథోడ్ పర్యటన.. పునరావాస కేంద్రాల్లోని వారికి భరోసా..

Oct 15, 2020, 1:47 PM IST

వరంగల్ నగరంలో గత రెండు రోజుల నుండి కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన 24వ డివిజన్ లోరాష్ట్ర గిరిజన, స్త్రీ  శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. పునరావాస కేంద్రంలోని స్థానికులను స్వయంగా అడిగి ముంపుకు గల కారణాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించడంలో ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.