Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులున్నా.. రైతుబంధు కింద 7వేల కోట్ల రూపాయలు..

మహబూబాబాద్ కలెక్టరేట్ లో నేడు జిల్లా రైతాంగ సమస్యల మీద జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

మహబూబాబాద్ కలెక్టరేట్ లో నేడు జిల్లా రైతాంగ సమస్యల మీద జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆలోచన మేరకు ప్రతి ఇంటికి మంచినీరు అందాలి. ఏ ఒక్క మహిళ బింద పట్టుకుని బయటకు రాకుండా మిషన్ భగీరథ అధికారులు చూడాలి. వరి, మొక్కల కొనుగోళ్లలో సేకరించిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఆదేశాలిచ్చాము. మక్కలను పౌల్ట్రీకి ఇస్తున్నందున, పౌల్ట్రీ సంఘంతో మాట్లాడి వెంటనే ఇక్కడి మొక్కలను పౌల్ట్రీకి తరలించాలని వ్యవసాయ శాఖ మంత్రిని కోరాము. 
లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు బంధు ఆపలేదని,  గతంలో కంటే వెయ్యి కోట్లు ఎక్కువగా  7వేల కోట్లరూపాయలిస్తున్నారన్నారు. లాక్ డౌన్ ఉన్నందున విత్తనాలు, మందులు, ఎరువులు దొరకవన్న ఆందోళన రైతులు చెందాల్సిన అవసరం లేదన్నారు.