సహచర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన హరీష్ రావు

మహబూబ్ నగర్: ఇటీవలే తండ్రిని కోల్పోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆయన నివాసంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కలిసి పరామర్శించారు.  

First Published Feb 18, 2021, 1:53 PM IST | Last Updated Feb 18, 2021, 1:53 PM IST

మహబూబ్ నగర్: ఇటీవలే తండ్రిని కోల్పోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆయన నివాసంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కలిసి పరామర్శించారు.  మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి  నారాయణ గౌడ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్ లోని  మంత్రి ఇంటికి వచ్చిన హరీశ్ రావు నారాయణ గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.  అనంతరం జరిగిన విషాదం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం‌ చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.