రైస్ మిల్లుల్లో తనిఖీలకు ఇది సమయం కాదు... ఆ బాధ్యత కిషన్ రెడ్డిదే: మంత్రి గంగుల
కరీంనగర్: కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సత్వరమే డబ్బులు అందించాలని ప్రయత్నిస్తున్నామని...
కరీంనగర్: కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సత్వరమే డబ్బులు అందించాలని ప్రయత్నిస్తున్నామని... అందుకోసమే ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు చేరుస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇలాంటి సమయంలో రైస్ మిల్లుల్లో ఎఫ్.సి.ఐ తనిఖీలు చేపడుతూ మిల్లుల్లో ధాన్యం దించకుండా వేదిస్తోందని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం బద్దిపల్లి, అసిఫ్ నగర్, నాగుల మాల్యాలలో డిసిఎంఎస్, ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ కు ఇది సరయిన సమయం కానందున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని రైతులకు సత్వర సేవలు అందేలా చూడాల్సిన బాధ్యతలు తీసుకోవాలన్నారు. సరైన సమయంలో పిజికల్ వెరిఫికేషన్ చేయడమే కాకుండా ఎలాంటి అక్రమాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని గంగుల అన్నారు.