దుక్కిదున్ని, మహిళలతో కలిసి వరినాట్లు వేస్తూ... కూలీ అవతారమెత్తిన మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి : తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సొంత పొలంలో రైతు కూలీ అవతారమెత్తారు.
పాలకుర్తి : తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సొంత పొలంలో రైతు కూలీ అవతారమెత్తారు. బురదతో కూడిన వరిమడిలో దిగి నాగలిపట్టి దుక్కిని రెడీ చేసిన మంత్రి. అలాగే మహిళా కూలీలతో సరదాగా ముచ్చటిస్తూనే వరినాట్లకు సంబంధించిన పనులు చేసారు. ఇలా మంత్రి హోదాను మరిచి తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో కూలీగా మారి వ్యవసాయంపై మక్కువను చాటుకున్నారు ఎర్రబెల్లి దయాకరరావు. ఇక స్వగ్రామంలోని పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. జనవరి 26 నుంచి 28 వరకు మహా కుంభాభిషేక మహోత్సవం జరగనుందని... భక్తులు భారీగా తరలివచ్చి శివునికి అభిషేకం చేసి తరించాలని సూచించారు. పున:ప్రతిష్ట ఏర్పాట్లను, భక్తుల వసతులను సంబంధిత అధికారులు, పోలీసులతో కలిసి పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి.