Asianet News TeluguAsianet News Telugu

మేడారం జాతర : గుడిమెలిగెతో ప్రారంభమయ్యే సమక్క సారలమ్మ జాతర

భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ వరంగల్ జిల్లా మేడారంలో జరిగే సమ్మక్కసారలమ్మ మహాజాతర. 

Jan 22, 2020, 7:12 PM IST

భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ వరంగల్ జిల్లా మేడారంలో జరిగే సమ్మక్కసారలమ్మ మహాజాతర. ఈ జాతర రెండేళ్లకొకసారి జరుగుతుంది. దీనికోసం తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు.రెండేళ్లకోసారి ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో మొదటి ఘట్టం బుధవారం ప్రారంభమవుతోంది. జాతరలో తొలి ఘట్టం గుడిమెలిగె జనవరి 22న మొదలవుతోంది. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహిస్తారు.