Asianet News TeluguAsianet News Telugu

అమ్మకానికి కేసీఆర్ విగ్రహం... కేసీఆర్ కు గుడికట్టి పూజించిన వీరభక్తుడి ఆవేదన ఇదీ

మంచిర్యాల: తెలంగాణ ఉద్యమ సమయంనుండి టీఆర్ఎస్ లో కొనసాగుతున్నా తనకు తగిన గుర్తింపు లేదన్న ఆవేదనతో ఓ ఉద్యమకారుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు.

మంచిర్యాల: తెలంగాణ ఉద్యమ సమయంనుండి టీఆర్ఎస్ లో కొనసాగుతున్నా తనకు తగిన గుర్తింపు లేదన్న ఆవేదనతో ఓ ఉద్యమకారుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను దైవసమానంగా భావించి సీఎం కేసీఆర్ కు గుడి కట్టి పూజించిన వ్యక్తే ఇప్పుడు ఆ గుడిని, కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. కష్టకాలంలో ఆదుకోని వారికి గుడులెందుకంటూ కొద్దినెలలుగా కేసీఆర్ విగ్రహానికి పూజలు నిలిపేసి ఓ వస్త్రాన్ని కప్పివుంచి ఇప్పుడు ఏకంగా అమ్మకానికే పెట్టాడు మంచిర్యాల జిల్లా దండేపల్లి వాసి గుండ రవీందర్.   టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2016 లో సీఎం కేసిఆర్ పై అభిమానంతో తన ఇంటివద్ద గుడికట్టి కుటుంబంతో కలిసి పూజలు చేశాడు రవీందర్. అయితే టీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడినా తన భాధలు చెప్పుకునేందుకు కూడా సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ అవకాశం ఇవ్వకపోవడంతో రవీందర్ తీవ్ర ఆవేదన చెంది ఇటీవలే ఆ పార్టీని వీడి బిజెపిలో చేరాడు. తాజాగా కుటుంబ పోషణ భారంగా మారడంతో కేసీఆర్ విగ్రహన్ని అమ్మేందుకు సిద్దమయ్యారు గుండ రవీందర్.