Asianet News TeluguAsianet News Telugu

భోగ శ్రావణి రాజీనామాపై స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల జిల్లా : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

జగిత్యాల జిల్లా : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిమీద జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందించారు. ఆమె నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. తండ్రి కూతుర్లలా ఉన్నాం.. మంచి ఫ్యూచర్ ఉందని ఎన్నో సార్లు చెప్పాను. గత కొన్ని నెలలుగా చైర్మన్ పై కౌన్సిలర్లు అసంతృప్తి చెందినా సర్ధి చెప్పాం. ఇటివల కౌన్సిలర్లు ఆవిశ్వాసం అంశం తీసుకువచ్చినా తోసిపుచ్చానన్నారు.

ఈ విషయం పై కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. బుధవారం ఉదయం కౌన్సిలర్ల సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు నేను స్వయంగా చైర్ పర్సన్ భోగ శ్రావణికి కాల్ చేసి తెలిపినా హజరు కాలేదని చెప్పుకొచ్చారు.