Asianet News TeluguAsianet News Telugu

ఉడుము పడ్డదని ఇల్లు విడిచిపెడితే.. తాపీగా పని కానిచ్చిన దొంగలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లె గ్రామంలో దొంగలు ఓ ఇంట్లో తాపీగా దొంగతనం చేసిన ఘటన కలకలం రేపింది

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లె గ్రామంలో దొంగలు ఓ ఇంట్లో తాపీగా దొంగతనం చేసిన ఘటన కలకలం రేపింది. ఈరుమల ఎల్లవ్వ భర్త బాల్ నర్స్ వారి ఇంట్లో గత అర్ధరాత్రి  దొంగలు పడి తాళం పగులగొట్టి ఇంట్లో నుండి కిలో పైగా వెండి, బంగారు ఉంగరాలు, వస్తువులను దొంగిలించారు. 20 రోజుల క్రితం ఇంట్లో ఉడుము వెళ్లిందని ఇల్లు విడిచిపెట్టి కమిటీ హాల్ లో ఉంటున్నారు. ఇది గమనించిన దొంగలు తాపీగా ఇల్లు సర్దేశారు. ఎస్సై నీలం రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు